జారిపడే వాన చినుకు వేగం ఎంతంటే ?

by Dishaweb |   ( Updated:2023-06-19 14:47:31.0  )
జారిపడే వాన చినుకు వేగం ఎంతంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : జలచక్రములో వర్షం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై, ఆ తేమ తిరిగి ఆకాశములో ధ్రవీభవించి బుడగలలాగా ఏర్పడిన అవపాతము ఆకాశానికి తేలుతుంది. ఆ అవపాతము వర్షముగా కురుస్తుంది. వర్షము పడిన అవపాతాన్ని తిరిగి సముద్రానికి చేర్చి నదులు ఈ చక్రాన్ని పూర్తి చేస్తాయి. మొక్కలు పీల్చుకున్న నీటిని శ్వాస క్రియలో ఆవిరిగా వాతావరణంలోకి వదులుతాయి. అలా వదిలిన ఆవిరి ఇతర నీటి అణువులను చేరి నీటి బిందువులుగా ఏర్పడతాయి. వర్షం ఎలా సంభవిస్తుంది, ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్ ప్రక్రియ అంటారు.

మేఘాలలోని నీరు వర్షంగా మారినప్పుడు భూ ఆకర్షణ శక్తికి గురువుతుంది. ఎంత ఎత్తులో నుండి కిందకు పడినా భూమి తన పరిధిలోని వస్తువు లేదా పదార్థాలను ఒకే విధంగా ఆకర్షిస్తుంది. అంటే వాన చినుకు ఎంత ఎత్తు నుంచి పడినా దాని వేగంలో మార్పు ఉండదు. ఒకే వేగంతో పడతాయి. గాలి బలంగా వీచినప్పుడు, ఆ గాలి తాకిడికి వర్షపు చినుకులు వేగంగా వచ్చి మనను తాకుతున్నట్లుగా మనం భావిస్తాం. అంతేగాని వేగం పెరగదు. వాన చినుకు వేగాన్ని సెకనుకు 9.8 న్యూటన్ మీటర్లుగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి :: పిల్లలు పడుకున్న వెంటనే త్వరగా నిద్రపోతారు.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed