Bra :బ్రా వేసుకోవడానికి సరైన వయసు ఏది.. ఎప్పటి నుంచి వాడాలంటే?

by Jakkula Samataha |
Bra :బ్రా వేసుకోవడానికి సరైన వయసు ఏది.. ఎప్పటి నుంచి వాడాలంటే?
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది లోదుస్తుల గురించి మాట్లాడటానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా బ్రా గురించి మాట్లాడితే ఏదో తప్పు చేసినట్లుగా చూస్తారు. కానీ దీని గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలు తప్పకుండా బ్రా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి టైమ్‌లో కొంత మంది మోహమాటంతో ఎలాంటి బ్రా వాడాలి? ఎప్పటి నుంచి వాడాలి? వంటి ప్రశ్నలు వారిలో కలిగినా, ఎవరినీ అడగలేక ఇబ్బంది పడుతుంటారు. కాగా, వారి కోసమే ఈ సమాచారం.

సాధారణంగా అమ్మాయిలు బ్రా వాడటానికి సరైన సమయం 9 నుంచి 11 ఏళ్ల వయసు. ఎందుకంటే ఈ సమయంలో వారి శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అందువలన ఆ టైమ్‌లో బ్రా వాడటం మంచిది అంటున్నారు నిపుణులు. అయితే ఈ విషయం గురించి ప్రతి తల్లి తమ బిడ్డకు వివరంగా చెప్పాలి. ఎలాంటి బ్రా వాడాలి? ఏ విధంగా మెలగాలి అనే విషయాలు తప్పకుండా చెప్పి వాళ్ల అవసరాలను అర్థం చేసుకునే అవగాహన ప్రతి తల్లికి ఉండాలంట. అప్పుడే మీ పిల్లలు సౌకర్యంగా ఉండగలుగుతారు.

అయితే మొదటి సారి బ్రా వాడే సమయంలో కొంత మంది తెలియకుండా కప్స్, లేస్ డిజైనింగ్ ఉన్నవి వాడుతుంటారు. కాగా, ఇలాంటివి అస్సలు వాడకూడదంట. మొదటి సారి బ్రా వాడేవారు టీనేజ్ బ్రా రకాన్ని ఎంచుకోవాలంట. దీనికి హుక్స్ ఉండవు అలాగే క్రాప్ టాప్‌లా ఉంటుంది. అది అమ్మాయిలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed