సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది అంటారు.. అసలు అది ఏమిటో తెలుసా?

by Jakkula Samataha |
సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది అంటారు.. అసలు అది ఏమిటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మన స్నేహితులు అప్పుడప్పుడు ఏదైనా విషయాన్ని చెబుతూ.. చూడు తప్పకుండా ఇలా జరుగుతుంది అంటారు. అప్పుడు మనం దానికి సమాధానం ఇస్తూ అలా ఎలా చెప్తున్నావు అంటే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని చెప్పుకొస్తారు. చాలా వరకు అవి నిజం అయితే, కొన్ని మాత్రం నిజంగా జరగవు. అయితే నిజంగా ఈ సిక్స్త్ సెన్స్ ఉంటుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే? మనలోని అతీంద్రియ శక్తి, అంతర్ దృష్టినే ఈ సిక్స్త్ సెన్స్ అంటున్నారు నిపుణులు.

దీని ద్వారా మనం ముందుగా జరిగే కొన్ని విషయాలను తేలికగా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా, మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, బంధాలను బలోపేతం చేసుకోవడానికి, మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందంట. అదే కాకుండా ప్రపంచం గురించి లోతైన అవగాహన పొందడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. అందువలన దీనిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సిక్స్త్ సెన్స్ పెరగాలంటే మొదటగా మనం ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే మనలోని భావాలను, ఆలోచనలు, ఊహలను మనకు మనమే గుర్తించి, వాటిని అర్థం చేసుకోవాలి. కొన్ని సార్లు మనం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మన మనసు వద్దు అని చెప్పడం లేదా ఇది చేయడం బెటర్ అని చెప్పడం జరుగుతుంది. అదే మన అంతర్గత స్వరం .. సిక్స్త్ సెన్స్. దీని ద్వారా మనం మన గురించి చాలా విషయాలు తెలుసుకొని, కొన్నింటిని ముందుగానే అంచనా వేస్తుంటాం. అలాగే, ప్రతి రోజూ కాసేపు ప్రశాంతంగా ఉండటం వలన కూడా సిక్త్స్ సెన్స్ అనేది పెరుగుతుంది. అంతే కాకుండా మన కలలు, మన ఆలోచనా విధానాలు, మన శరీర స్పందన వీటన్నింటిని బట్టి మనం మన సిక్స్త్ సెన్స్ పెంచుకోవచ్చునంట.

Advertisement

Next Story

Most Viewed