- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలకు తల్లిదండ్రుల పోలికలు ఎలా వస్తాయి..?
దిశ,వెబ్‌డెస్క్ : ఈ అమ్మాయి అచ్చం తండ్రి పోలికే.. ఈ అబ్బాయి తల్లికి జిరాక్స్ కాపీనే.. ఈ పిల్లకు అన్నీ తల్లి బుద్దులే వచ్చాయి.. ఇలాంటి మాటలు తరచూ వింటుంటాం. మనం కూడా ఎక్కడో ఒక దగ్గర అనే ఉంటా. పూర్వ కాలం నుంచి నేటి వరకు నమ్మే సిద్దాంతం ఏంటంటే పిల్లల్లో కనిపించే లక్షణాలకు తమ రక్తమే కారణమని తల్లిదండ్రులు భావించడం. కానీ ఆ లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారని, దానికి కారణం జన్యువులనీ ప్రముఖ శాస్త్రవేత్త గ్రెగర్ జాన్ మెండల్ తేల్చి చెప్పారు. అది ఎలాగో కూడా నిరూపించి వివరించారు.
జన్యువులు డీఎన్ఎ నిర్మాణంలోని నిర్ధిష్ట ప్రదేశాలు. ఇవి క్రోమోజోములలో ఉంటాయి. మానవశరీరంలో దాదాపు కోటి కోట్ల కణాలు ఉంటాయని అంచనా. ఇంత సూక్ష్మమైన కణాలతో క్రోమోజోమ్ లు వాటిలోపల డీఎన్ఏ ఉంటుంది. జుట్టు, కళ్ళ రంగును నిర్ణయించేది డీఎన్ఏ లో భాగమైన జన్యువులు తయారుచేసే ప్రోటీన్లే. డీ ఆక్సీరైబో న్యూక్లియర్ ఆసిడ్ (డీఎన్ఏ), అడినైన్ థయమిన్, గ్వానైన్, సైటోసైన్ అనే నాలుగు న్యుక్లియోటెడ్ బేస్ లతో కలసి డీఎన్ఏ తయారవుతుంది.
మెలి తిరిగినా నిచ్చేనలాంటి ఆకారం కలిగి ఉన్న డి.ఎన్.ఏ పై ప్రోటీన్ల ఉత్పత్తి జరిగి తద్వారా ఒక జీవికి కావలసిన అన్ని లక్షణాలు ఆధారపడి ఉంటాయి.జన్యువు అంటే క్రోమోజోమ్ లలో ఉండే డీఎన్ఏ పోగులో కొంత భాగం. నిర్దిష్ట ప్రోటీన్లను తయారు చేసేందుకు అవసరమైన సమాచారం జన్యువుల్లో ఉంటుంది. ఏ ప్రోటీన్ ఏ సమయంలో తయారుకావాలో తెలిపే సమాచారం కూడా జన్యువులలోనే ఉంటుంది.
Read More... అనవసరంగా పోలీసులు మనల్ని కొట్టినా, తిట్టినా అది నేరమే తెలుసా