సడెన్ గా గుండెపోటుకు కారణమేంటి? ముందు కనిపించే లక్షణాలేంటి?

by Sathputhe Rajesh |
సడెన్ గా గుండెపోటుకు కారణమేంటి? ముందు కనిపించే లక్షణాలేంటి?
X

దిశ, ఫీచర్స్: సడెన్ కార్డియాక్ డెత్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. షేన్ వార్న్, పునీత్ రాజ్‌కుమార్, సిద్ధార్థ్ శుక్లా లాంటి సెలబ్రిటీలు ఈ కారణంగానే మృతిచెందగా.. అన్ని ఏజ్ గ్రూప్‌ల్లోనూ ఇది కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. గుండెకు రక్తసరఫరా ఆగిపోవడంతో హార్ట్ డ్యామేజ్ అవుతుందని.. మారిన జీవనవిధానం, ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో పాటు మరిన్ని ఆశ్చర్యకరమైన నిజాలు ఇందుకు కారణంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

1. నోటి బ్యాక్టీరియా

పీరియాంటల్ వ్యాధులకు కారణమయ్యే నోటి బ్యాక్టీరియా గుండెపోటుకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా ధమనుల‌లో వాపుకు కారణమై.. తద్వారా అక్కడ కొవ్వు పేరుకుపోయేలా చేస్తుందని, తద్వారా గుండెపోటుకు కారణమవుతుందన్నారు. మన శరీరంలోని వాపుకు అనేక కారణాలు ఉండొచ్చని.. కానీ ఇవి హార్ట్‌ఎటాక్‌కు ఒక రీజన్‌గా ఉంటున్నాయని చెబుతున్నారు. అందుకే శరీరంలో ఏ భాగంలో వాపు వచ్చినా ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

2. డిప్రెషన్‌

డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు నిస్సహాయంగా కనిపిస్తారు. సంతోషానికి దూరంగా ఎప్పుడూ బాధలోనే ఉండే వీరి జీవనశైలి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అతిగా ఆలోచించడం, ఇతరులతో కాంటాక్ట్‌లో ఉండకపోవడం, వ్యాయామం, యోగాలాంటి వాటికి దూరంగా ఉండటం సడెన్ కార్డియాక్ డెత్‌ ప్రమాదాన్ని పెంచుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

3. ఆటో ఇమ్యూన్ ఇల్‌నెస్

ఆటో ఇమ్యూన్ డిసీజ్‌ అనేది చిన్నపిల్లల్లో గుండెపోటుకు కారణమవుతుంది. రక్తనాళాలలో వాపుకు కారణమయ్యే ఈ వ్యాధి హార్ట్ ఎటాక్‌ కలిగించే మరో అంశంగా కనిపిస్తోంది. కవాసాకి వ్యాధి కారణంగా చిన్నపిల్లల్లో కరోనరీ ధమనులు ఉబ్బిపోయి గుండెపోటుకు దారితీయొచ్చు.

4. కొకైన్

డ్రగ్ అడిక్షన్ అనేది హార్ట్ ఎటాక్‌కు గురయ్యే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. నికోటిన్, స్మోకింగ్ అనేవి ఇప్పటికే గుండెపోటుకు కారణాలుగా ఉండగా.. కొకైన్ వినియోగం కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. ముఖ్యంగా స్టిమ్యులేట్ డ్రగ్స్.. బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్ పెంచి గుండెపోటుకు కారణమవుతున్నాయి.

5. ఒంటరితనం

ఒంటరితనం కూడా హార్ట్ డిసీజ్‌కు కారణం. లోన్లీనెస్.. స్ట్రెస్, హై బీపీతో అసోసియేట్ అయి ఉంటుంది. గ్రూప్ యాక్టివిటీస్‌లో బిజీ అయిపోయి, స్ట్రాంగ్ సోషల్ నెట్‌వర్క్ పెంచుకుంటే హార్ట్‌ఎటాక్ రాకుండా ఉండొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

6. కరోనరీ ఆర్టరీకి గాయం

చిన్న వయసులో గుండెపోటుకు కరోనరీ ఆర్టరీ డిసీజ్‌(గుండె ప్రధాన రక్తనాళాల్లో డ్యామేజ్) కారణమవుతోంది. ఈ వ్యాధి మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. రక్తనాళాల్లో అంతర్గత రక్తస్రావం కారణంగా గుండెపోటు వచ్చే అవకాశముంది. అయితే ఈ పరిస్థితిని డయాగ్నోస్ చేయడం, వెంటనే చికిత్స అందించడం కష్టమని చెబుతున్నారు వైద్యులు.

Advertisement

Next Story