సడెన్‌గా సద్గురుకు సర్జరీ.. ఆ ప్రాణాంతక వ్యాధి గురించి తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-03-23 06:20:10.0  )
సడెన్‌గా సద్గురుకు సర్జరీ.. ఆ ప్రాణాంతక వ్యాధి గురించి తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈయన శివరాత్రి తరువాత బ్రెయిన్ బ్లీడ్ కారణంగా ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరగా, ఆయనకు వైద్యులు ఎమర్జెన్సీగా సర్జరీ చేశారు. శివరాత్రి రోజు చాలా ఉత్సాహంగా ఉన్న గురువుగారు సడెన్‌గా ఆపరేషన్ చేసుకోవడంతో ఆయన భక్తులు, అభిమానులు అందరూ షాక్‌కు గురి అవుతున్నారు. ఒక్కసారిగా సద్గురు కి ఏమైంది? అసలు బ్రెయిన్ బ్లీడ్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుదాం.

బ్రెయిన్ బ్లీడ్‌ను హెమరేజ్ స్ట్రోక్ అని కూడా అంటారు. మెదడులో రక్తస్రావం అనేది, రక్తనాళాలు ఒత్తిడికి లోనై బలహీనపడినప్పుడు జరుగుతుంది. మెదడులోని కణజాలం, పుర్రె మధ్య లేదా మెదడు కణాజాలంలోనే రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ అందదు. ఇది ప్రాణాంతకమైనది. ఆలస్యం చేస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎమెర్జెన్సీ శస్త్రచికిత్స చేస్తారు.

బ్రెయిన్ హెమరేజ్ లక్షణాలు :

కళ్లు తిరగడం, వికారం

దీర్ఘకాలిక తలనొప్పి

సడెన్‌గా జలదరింపు, వీక్ అవ్వడం

తీవ్రమైన అలసట

కంటి చూపు మందగించడం

శ్వాస తీసుకోవడంలో మార్పులు

హార్ట్ బీట్‌లో మార్పులు

Advertisement

Next Story

Most Viewed