- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Laughter Yoga: ప్రతీ రోజూ నవ్వితే ఇన్ని ప్రయోజనాలా..?
దిశ, ఫీచర్స్: ఈ బిజీ కాలంలో చాలామంది ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. దీని వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రశాంతంగా కూర్చుని మనస్ఫూర్తిగా నవ్వడమే మానేశారు. నవరసాల్లో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది హాస్యరసమే. అలాంటి హాస్యం ప్రతీ ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. నవ్వించడం ఒక యోగము, నవ్వడం భోగము, నవ్వకపోవడం రోగం అనే మాటను పెద్దలు చెబుతుంటారు. ప్రతీ ఒక్కరూ నిత్యం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు మాత్రమే. ఈ రోజుల్లో చాలామంది ఏదైనా కామెడీ షో, సినిమా చూస్తూ, ఫన్నీ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే నవ్వుతుంటారు. నవ్వు మంచి వ్యాయామం లాంటిది. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటుగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ నవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చదివేయండి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ప్రతీ రోజూ నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల రక్తనాళాలకు విశ్రాంతి లభిస్తుంది. గట్టిగా నవ్వడం వల్ల శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయి.
శరీర నొప్పులు మాయం: ప్రతి రోజూ గట్టిగా నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. దీని వల్ల శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. స్నేహితులు లేదా బంధువులతో కలిసి కూర్చొని నవ్వడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల ఇతరుల పట్ల ప్రేమ, కుటుంబ బంధాలు బలపడతాయి. ఇది శరీరానికి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచి, శరీరాన్ని తేలికగా ఉంచుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది: రోజుకు 10 లేదా 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజసిద్ధమైన నవ్వు స్ట్రెస్‌ను తగ్గించి మైండ్‌ను రిలాక్స్ చేస్తుంది. గట్టిగా నవ్వినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇవి ఒత్తిడికి కారణమైన కార్డిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని కారణంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
గుండెకు మంచిది: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు గుండె సంబంధిత కారణాల వల్ల జరుగుతుంటాయి. ప్రతీ రోజు మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది గుండె స్పందన రేటును పెంచుతుంది. రక్తప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా మైగ్రేన్, డయాబెటీస్, రక్తపోటు డిప్రెషన్, అలర్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
పరస్పర సంబంధాలు: పరస్పర సంబంధాలను బలోపేతం చేయడానికి నవ్వు ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. నవ్వు భావోద్వేగాన్ని పెంచి, కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది.
అంతేకాకుండా శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతీ రోజూ నవ్వడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. నిద్రలేమి సమస్యల నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి రోజూ 10 నుండి 15 నిమిషాల పాటు గట్టిగా నవ్వడం అలవాటు చేసుకోండి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.
Read More...
Beauty Tips: చర్మం మెరవాలంటే క్యారెట్‌ను ఇలా వాడడండి!