Menopause: వామ్మో.. చాలా జాగ్రత్తగా ఉండాలి.. మూడు పదుల వయసు దాటకముందే పీరియడ్స్‌ ఆగే ప్రమాదం

by Vennela |
Menopause: వామ్మో.. చాలా జాగ్రత్తగా ఉండాలి.. మూడు పదుల వయసు దాటకముందే పీరియడ్స్‌ ఆగే ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: Premature Menopause Symptoms: మహిళల్లో పీరియడ్స్ సమస్య సర్వసాధారణమైన ప్రక్రియ. సాధారణంగా 45 నుంచి 55ఏళ్ల మధ్య పీరియడ్స్ ఆగిపోతుంటాయి. కానీ కొందరికి చాలా త్వరగా 30 నుంచి 40ఏళ్ల ముందే నిలిచిపోయే అవకాశం ఉంటుంది. దీన్నే ప్రిమోచ్యూర్ మెనోపాజ్(Premature Menopause) దశ అంటారు. ఇది శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది కలిగించే అంశం. దీన్ని అన్నిసార్లూ నివారించలేకపోవచ్చు. కానీ కొన్ని కారణాలను అర్థం చేసుకోవడం, లక్షణాలను గుర్తించడం దానికి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ముందుగానే నెలసరి ఆగిపోవడం మీద అవగాహన కలిగి ఉంటే మంచిందంటున్నారు.

ఏంటీ ప్రిమెచ్యూర్ మెనోపాజ్?

రుతుక్రమం అనేది గర్భధారణకు తోడ్పడే ప్రక్రియ. ప్రతినెలా అండాశయాల నుంచి ఒక అండం విడుదలవ్వడం. ఇది కుదురుకోవడానికి గర్భసంచీలో ఒక పొర ఏర్పడటం, గర్భం ధరించకోతే ఈ పొర విడిపోయి రుతుస్రావం రూపంలో బయటకు రావడం.. ఇదంతా ఒక చక్రం వలే సాగిపోతుంది. ఈ ప్రక్రియ ఎంత సహజమూ నెలసరి నిలిచిపోవడం కూడా అంతే. కానీ కొందరికి ముందుగానే నిలిచిపోతుంది. దీన్ని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఇన్ సఫిషియోన్సీ(Premature ovarian insufficiency) అంటారని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో 40ఏళ్లలోపే అండాశయాల పనితీరు అస్తవ్యస్తమవుతుందని..ఫలితంగా అండాలు విడుదల కావంటున్నారు. ఈస్ట్రోజన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తీ తగ్గుతుందని.. చివరికి రుతుక్రమం నిలిచిపోవడానికి దారితీస్తుందని చెబుతున్నారు.

ఎందుకిలా జరుగుతుంది..కారణం ఏంటీ?

నెలసరి ముందుగానే నిలిచిపోవడానికి జన్యువుల దగ్గరి నుంచి ఇతర చికిత్సల వరకు అనేక రకాల అంశాలు దోహదం చేస్తుంటాయి.

* కొందరికి వంశపారంపర్యంగా త్వరగా నెలసరి ఆగిపోవచ్చని చెబుతున్నారు నిపుణులు. తల్లి, సోదరుల్లో ఎవరైనా త్వరగా నెలసరి నిలిచిపోయినా వారుంటే వీరికి ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు.

*కొందరిలో ఇమ్యూనిటీ వ్యవస్థ పొరపాటున అండాశయాల మీద దాడి చేయవచ్చని..ఇది త్వరగా నెలసరి నిలిచిపోవడానికి దారితీస్తుందంటున్నారు.

*పుట్టుకతో ఒకే ఒక్క ఎక్స్ క్రోమోజోన్ ఉండటం, ఫ్రాజైల్ ఎక్స్ సిండ్రోమ్ వంటి క్రోమోజోమ్ లోపాలూ అండాశయాల పనితీరును అస్తవ్యస్తం చేయవచ్చని..దీంతో ముందుగానే నెలసరి ఆగిపోయే ప్రమాదం ఉందంటున్నారు.

* క్యాన్సర్ బారినప్పుడు తీసుకునే కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు కూడా అండాశయాలను దెబ్బతీయవచ్చని..ఇది నెలసరి ఆగిపోవడానికి కారణం కావచ్చు అంటున్నారు.

* క్షయ, గవదబిళ్లల వంటి ఇన్ఫెక్షన్లు కూడా అండాశయాల పనితీరును అస్తవ్యస్తం చేయోచ్చని ఇది కొందరిలో ముందుగానే నెలసరి నిలిచిపోవటానికి దారితీయవచ్చని చెబుతున్నారు.

*కొందరికి అండాశయాల్లో నీటిబుడగలు తలెత్తడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి అస్తవ్యస్తమైన అండాలు దెబ్బతినొచ్చని..ఇది త్వరగా నెలసరి ఆగిపోవడానికి కారణం అంటున్నారు.

చికిత్స:

ముందుగానే నెలసరి నిలిచిపోవడాన్ని వెనక్కి మళ్లించలేము. కానీ లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవడానికి, దీర్ఘకాలంలో తలెత్తబోయే జబ్బుల ముప్పు తగ్గించుకోవడానికి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే రోజువారీ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవడమూ కూడా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. నెలసరి ముందుగా నిలిచినవారికి ఎముక క్షీణించే ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకల బలోపేతానికి తోడ్పడే కాల్షియం, విటమిన్ డితో కూడిన ఆహారం తినడం కూడా ముఖ్యమని, వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement
Next Story