- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Wedding Card : క్వశ్చన్ పేపర్ రూపంలో వెడ్డింగ్ కార్డు.. వందకు వంద మార్కులు వేసేశారు..
దిశ, ఫీచర్స్ : పెళ్లి అంటేనే సందడి. జీవితంలో ఘనంగా జరుగుపుకునే వేడుక. ఇలాంటి కార్యాన్ని భవిష్యత్తు తరాలు కూడా గుర్తుంచుకునేలా ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఆ దిశగా ప్రయత్నిస్తారు. వీటిలో వెడ్డింగ్ కార్డు కూడా ఒకటి. కాగా పెళ్లి ఆహ్వాన పత్రిక విషయంలో ట్రెండ్ మారింది. రోజుకో రకమైన కార్డ్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. అలాంటిదే ఇది కూడా. ప్రశ్నాపత్రం రూపంలో పెళ్లి పత్రికను ముద్రించారు ఈ వధూవరులు. వీరిద్దరూ కాలేజీలో లెక్చరర్స్ అని తెలుస్తుండగా.. ఇందులోని వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఫొటోలో ఉన్న వ్యకి ఎవరో గుర్తించారా? అనేది తొలి ప్రశ్న కాగా పెళ్లి కొడుకు ఫణీంద్ర అని సమాధానం ఇవ్వబడింది. ఇక వధువు పేరు కరెక్ట్ చేయండి అనే క్వశ్చన్ కు ఆన్సర్ ప్రత్యూష. కాగా ఇలా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, బిట్స్, ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో ప్రశ్నలు అడిగి... తేదీ, ముహూర్తం, పెళ్లి వేదిక వంటి సమాచారం పూర్తిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. క్రియేటివిటీకి సలామ్ చెప్తున్నారు నెటిజన్లు.