రోడ్డుపై బస్సు ఆపి మరీ, పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు మహిళలు!

by Dishafeatures1 |
రోడ్డుపై బస్సు ఆపి మరీ, పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు మహిళలు!
X

దిశ, ఫీచర్స్: కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో వీడియోలు బాగా వైరల్ అవుతాయి. తాజాగా ఓ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలో ఓ మహిళా బస్సు డ్రైవర్, అదేవిధంగా మరో మహిళ కొట్టుకున్నారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని అవెన్యూ మరియు జెఫెర్సన్ బౌలేవార్డ్ ప్రాంతంలో నడిరోడ్డుపై సిటీ బస్సు మహిళా డ్రైవర్, ఓ మహిళ మధ్య ఓ వివాదం చెలరేగింది. అది వారి మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. డ్రైవర్‌ సీటు లోంచి లాగి మరీ ఆ మహిళా డ్రైవర్ ను కొట్టింది. దీంతో ఆ మహిళ డ్రైవర్ కూడా ఆమెను తిరిగి కొట్టడం ప్రారంభించింది. ఇలా చాలా సేపు కొట్టుకుంటున్న వారిని చూసి ఆపడం మానేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

Next Story

Most Viewed