- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పీరియడ్ నొప్పికి నేచురల్ రెమెడీ పసుపు.. ఇలా తీసుకుంటే బెటర్

దిశ, ఫీచర్స్ : పీరియడ్ పెయిన్ చాలా మంది మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య. ఈ నొప్పి నివారణకు చాలా మందులు అందుబాటులో ఉన్నా.. పసుపు చక్కటి పరిష్కారం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన ఈ సూపర్ ఫుడ్ రుతుక్రమంలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ పీరియడ్ క్రాంప్స్‌కు దారితీసే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతాయి. భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ అవుతాయి.
పీరియడ్ పెయిన్ అంటే..?
అమ్మాయిల నెలసరి సమయంలో వచ్చే నొప్పిని డిస్మెనోరియా అని కూడా పిలుస్తారు. ఈ టైంలో పొత్తి కడుపులో అనుభవించే నొప్పి తేలికపాటి నుంచి తీవ్రమైనదిగా ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. దీంతోపాటు నడుము నొప్పి, వికారం, విరేచనాలు, తలనొప్పిని కూడా అనుభవించవచ్చు. అయితే ఈ సమయంలో పసుపు తీసుకోవడం వల్ల నొప్పిని సులభంగా నివారించవచ్చు. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిస్పాస్మోడిక్, అనాల్జేసిక్ లక్షణాలు.. రుతు తిమ్మిరి, వాపు తగ్గించి గర్భాశయ కండరాల సడలింపును ప్రోత్సహిస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా కర్కుమిన్ ఈస్ట్రోజెన్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యతను పెంచుతుంది. తద్వారా పీరియడ్ సైకిల్ లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది.
ఎలా తీసుకోవాలి?
1. పసుపు టీ
పసుపు టీ తయారు చేయడానికి.. నీటిని మరిగించి, ఒక టీస్పూన్ పసుపు పొడిని యాడ్ చేయండి. 5-10 నిమిషాలు మరిగించి.. ఆపై వడకట్టి తాగండి. రుచి కోసం తేనె లేదా నిమ్మకాయను యాడ్ చేసుకోవచ్చు.
2. గోల్డ్ మిల్క్
గోల్డెన్ మిల్క్ తయారు చేయడానికి.. పాలలో చిటికెడు పసుపు పొడి, చిటికెడు నల్ల మిరియాలు, కొద్దిగా అల్లం వేసి వేడి చేయండి. 5-10 నిమిషాలు మరిగించి రుచి కోసం తేనె లేదా కొబ్బరి నూనె యాడ్ చేయండి. వేడివేడిగాగ ఆస్వాదించండి.
3. స్మూతీ
టర్మెరిక్ స్మూతీని తయారు చేయడానికి.. ఫ్రోజ్ చేసిన పండ్లు, పాలకూర, బాదం పాలు, ఒక టీస్పూన్ పసుపు పొడి, చిటికెడు నల్ల మిరియాలు అన్నింటిని తీసుకుని బ్లెండ్ చేయండి. దానికి తేనె లేదా కొబ్బరి నూనె యాడ్ చేసి తీసుకోండి.