హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో 95 శాతం సక్సెస్ రేట్.. అట్రాక్ట్ చేస్తున్న క్లినిక్స్

by Mahesh |   ( Updated:2025-03-16 04:35:56.0  )
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో 95 శాతం సక్సెస్ రేట్.. అట్రాక్ట్ చేస్తున్న క్లినిక్స్
X

దిశ, ఫీచర్స్ : మానవ జీవన శైలి.. పర్యావరణ కాలుష్యం.. వారసత్వం.. కారణమేదైనా చిన్నప్పుడే బట్టతల, తెల్ల జుట్టు ఇప్పుడంతా కామన్. జుట్టు చింత మిమ్మల్ని వెంటాడుతుంటే.. ఇలాంటి ఆందోళన ఏ మాత్రం అవసరం లేదని హామీ ఇస్తోంది తుర్కియే దేశం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పరిశ్రమలో ఆధునాతన విధానాలు, అసాధారణమైన రోగి సంరక్షణ సామర్థ్యంతో ప్రపంచంలోనే అగ్రగామిగా మారి.. వరల్డ్ వైడ్ అటెన్షన్ క్యాచ్ చేస్తుంది.

చల్.. చలో టర్కీ

అత్యాధునిక సాంకేతికత, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులతో టర్కీ ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన జుట్టు రాలడం పరిష్కారాలను కోరుకునే రోగులను ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే ఆ దేశపు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు బట్టతలతో ఉన్న మనుషులతో నిండిపోవడం అక్కడ రోజూ కనిపించే సీన్‌గా మారిపోయింది. బట్టతల ఉన్నవాళ్లంతా సమావేశమయ్యారా అన్నట్లుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో జుట్టు మార్పిడి విధానాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు గణనీయమైన పెట్టుబడులు వస్తున్నాయి. టర్కిష్ వైద్య నిపుణులు ఏటా వేలాది విజయవంతమైన కేసులతో దూసుకుపోవడంతోపాటు టర్కిష్ క్లినిక్‌లు వైద్య రంగంలో తాజా టెక్నాలజీని ఉపయోగించడం కూడా ఇందుకు కారణమే. రోబోటిక్ DHI,డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ (DHI) వంటి మోడ్రన్ టెక్నిక్స్ ..తక్కువ రికవరీ సమయంతో సహజంగా కనిపించే ఫలితాలను అందిస్తున్నాయి.

3, 4 రోజుల్లో రికవరీ..

ఇక్కడి క్లినిక్స్ 95శాతం సక్సెస్ రేట్, మూడు నాలుగు రోజుల రికవరీ టైమ్‌తో పేషెంట్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. రోబోటిక్ DHIతో రోగి జుట్టు మార్పిడిని పర్యవేక్షించవచ్చు. అమర్చిన గ్రాఫ్ట్‌ల సంఖ్యను ట్రాక్ చేయవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న జుట్టుకు నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. దట్టమైన, ఆరోగ్యకరమైన జుట్టు ఫలితాలకు దారితీస్తుంది. అక్కడి నిపుణులు హెయిర్‌లైన్ డిజైన్లలో ప్రత్యేకత కలిగి ఉండి.. ప్రతి రోగి ముఖ నిర్మాణం, వయస్సు,జాతికి అనుగుణంగా ట్రీట్ చేస్తుంటారు. కాకేసియన్, ఆసియన్, ఆఫ్రికన్ వంటి అన్ని రకాల జుట్టులతో పనిచేయడంలో నైపుణ్యం కలిగిన వారు.. ఫైనల్ రిజల్ట్ చాలా నేచురల్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Read More..

Skin: మీ చ‌ర్మం మెరిసిపోవాలంటే.. వీటిని పాటించండి..!

Next Story

Most Viewed