మీ జుట్టు అందంగా, పొడవుగా పెరగలా.. మందార పువ్వుతో ఈ టిప్స్ ట్రై చేయండి!

by Jakkula Samataha |
మీ జుట్టు అందంగా, పొడవుగా పెరగలా.. మందార పువ్వుతో ఈ టిప్స్ ట్రై చేయండి!
X

దిశ, ఫీచర్స్ : అందం అంటే అమ్మాయిలు. ఇక వారికి మరింత అందాన్ని ఇచ్చేది జుట్టు. చాలా మంది అబ్బాయిలకు పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిలంటే చాలా ఇష్టం ఉంటుంది అని అంటుంటారు. అంతే కాకుండా పెళ్లి సంబంధాల సమయంలో కూడా అమ్మాయి జుట్టు పొడవుగా ఉందా అని కూడా చూస్తారు అంటారు కొందరు. కానీ ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలకు అసలు జుట్టు పొడవుగా ఉండటం లేదు. తీసుకునే ఆహారం, జీవన శైలి కారణంగా వారిలో హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దీంతో మార్కెట్‌లో దొరికే వివిధ రకాల క్రీమ్స్ కొనుగోలు చేసి వాడుతున్నారు. దీని వలన అనేక సమస్యల పాలు అవుతున్నారు. కానీ హోమ్ రెమిడీ చిట్కాల ద్వారా జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చు అంటున్నారు కొందరు. అది ఎలానో? ఆ చక్కటి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

1. మందార పువ్వులను మన హెయిర్ ఆయిల్‌లో రెండు నిమిషాల పాటు ఉడక బెట్టి దానిని పేస్టులా తయారు చేసి రెండు రోజులకు ఒకసారి పేస్టులా తలకు పట్టడం వలన డాండ్రఫ్ తగ్గిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుందంట.

2. మందార పువ్వులు, ఆకులును పేస్టులా తయారు చేసి అందులో కాస్త కలబంద జల్‌ను కలి ఈ పేస్ట్‌ను వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు పెడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది అంటున్నారు.

3. ఉసిరికాయల పొడి, మందార పూల పొడి సహాయంతో మీ జుట్టును మృదువుగా మార్చుకోవడమే కాకుండా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చునంట.

4. ఎండబెట్టిన మందార ఆకులు, మాందార పూల పొడిని సమ ‌ మోతాదులో కలిపి కాస్త నిమ్మరసం యాడ్ చేయాలి. ఆ తరువాత దానిని తలకు పట్టించండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు మృదువుగా మారుతుందంట.

Advertisement

Next Story

Most Viewed