భార్యను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసా? భర్తలకు ఇది గుడ్ న్యూసే..!

by samatah |   ( Updated:2023-08-12 12:20:58.0  )
భార్యను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసా? భర్తలకు ఇది గుడ్ న్యూసే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు ముళ్లతో ఒకటై నిండు నూరేళ్లు రెండు మనుసులు ఒకటిగా జీవిస్తారు. ఇక ఒకప్పడు భార్యలు భర్తలకు చాలా గౌరవం ఇస్తూ, వారి చెప్పిన మాట వినేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇద్దరూ సంపాదిస్తుడటంతో, నీకంటే నేను ఏం తక్కువ అన్నట్లు, భర్తను పట్టించుకోకపోవడం, లేదా ప్రతీ విషయంలో భర్తతో గొడవపడటం మాములు అయిపోయింది. దీంతో కొంత మంది మగవారు భార్య పెట్టే బాధలు భరించలేక, స్నేహితుల వద్ద చెప్పుకోలేక చాలా మానసికంగా చాలా బాధపడి పోతుంటారు.

అంతే కాకుండా ఇక ఈ సోషల్ మీడియా వచ్చాక, చాలా మంది తమ భార్యను కంట్రోల్‌లో పెట్టుకోవడం ఎలా అని ఎక్కువగా సెర్చ్ చేశారని లాక్ డౌన్ సమయంలో వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పాపం భార్యల వలన ఇబ్బందులు పడుతూ, వారిని కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నవారికి కోసమే ఈ న్యూస్.

పెళ్లి రోజు నుంచి ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి

కొంత మంది భర్తలు పెళ్లి అయ్యాక భార్యను చాలా బాగా చూసుకుంటారు. ఇక పాప,బాబు పుట్టిన తర్వాత వారి ప్రేమ తగ్గుతూ ఉంటుంది. దీంతో భార్యకు కోపం వచ్చి భర్తను సాధించడం మొదలు పెడుతుంది. ఎప్పుడూ నీకు నాపై ప్రేమ తగ్గింది అంటూ ఇంట్లో గొడవ పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందువలన పెళ్లి రోజు నుంచి ఎప్పుడూ భార్యపై ఒకే విధమైన ప్రేమ చూపించడం ద్వారా ఆమె మీరు చెప్పిన మాట వింటుంది.

భార్యతో సన్నిహితంగా మెదలాలి :

భార్యతో ఎప్పుడూ సన్నిహితంగా మెదలాలి. ఎకనామికల్‌గా కాకుండా ఆమెతో ఏదైనా విషయం చర్చిస్తూ క్లోజ్‌గా మూవ్ అవుతూ, ఇంటి పరిస్థితులు లేదా మీరు ఏదైనా చేయాలనుకున్న పనులను చెప్పాలి. ఇలా చేయడం ద్వారా తను మీ మాట వినడం, మీరు చెప్పినదానికి ఒకే చెప్పడం లాంటిది చేస్తుంది.

మీ భార్య బల, బలహీనతలు ఏంటో తెలుసుకోవాలి

మీ భార్య బల, బలహీనతలు ఏంటో తెలుసుకొని వాటిని మీకు అనుగుణంగా, మీ కాపురానికి అనుగుణంగా మలుచుకోవాలి. అంతే కాకుండా మీ భార్య తరఫున వారితో మంచిగా ఉండటం వలన వారిని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చంట.

శారీరకంగా దగ్గరగా ఉండటం

మీరు మీ భార్యతో శారీరకంగా దగ్గరగా ఉండటం వలన మీ బంధం మరింత ధృఢ పడుతుందంట. దీని వలన కూడా మీరు మీ వైఫ్‌ను మీ మాట వినేలా చేసుకొవచ్చు అంటున్నారు నిపుణులు.

అతిగా కోపం ఉన్న భార్యతో మీరు తగ్గినట్లుగా మాట్లాడటం

కొంత మంది భార్యలు ఊరికురికే కోపం తెచ్చుకుంటారు. అయితే అలాంటి వారి ముందు మిమ్ముల్ని మీరు పొగడకూడదంట. తనను తన అందాన్ని పొగుడ్తూ ఉండాలంట. అంతే కాకుండా తాను ఏదీ చెప్పినా ఒకే అంటూ.. మధ్యలో ఇదికాదు అలా చేద్దాం అని ప్రేమగా చెప్పాలంట. దీని వలన ఆమె మీరు చెప్పినది వింటుందంట.

Read More: ఈ సారి జోక్‌ను ఎడమ చెవి ద్వారా వినండి.. మెడిసిన్‌లా పని చేస్తుందట.. లేదంటే

Advertisement

Next Story

Most Viewed