- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ భార్య మీపై కోపంగా ఉందా.. ఆ కోపాన్ని ఇలా తగ్గించండి..
దిశ, ఫీచర్స్ : ఇంట్లో భర్త ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు భార్య కోపంతో ఊగిపోతుంది.. వంటింట్లోని పాత్రలన్నీ మీదికి విసిరేస్తుంది. అంతే కాదు ఇంకా రుసరుసలు బుసబుసలు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే కోపంతో ఉన్న భార్యను హ్యాండిల్ చేయడం అంటే కొంతమంది భర్తలకు వెన్నతో పెట్టిన విద్య, మరికొంతమంది భర్తలు మాత్రం వాల్లని తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి వెళ్లి వారి కోపం తగ్గిపోయిన తర్వాత మెల్లిగా ఇంటికి తిరిగి వస్తారు. అయితే భార్యల కోపం నుంచి తప్పించుకోవాలంటే నేటి తరం భర్తలకు కొన్ని టిప్స్ అందిస్తున్నారు నిపుణులు. మరి అలాంటి సూచనలు ఏంటి ? పాటిస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్నిసార్లు భార్యలు కోపంతో ఉన్నప్పుడు వారి కాస్త మొరటుగా మాట్లాడతారు. అంతే కాదు ఎప్పుడు వాడని పదజాలంలో మాటలు వదులుతుంటారు. అలాంటి కొన్ని మాటలను భర్తలు విని వినకుండా వదిలేయాలని చెబుతున్నారు నిపుణులు. భార్యల కోపం తగ్గిన తర్వాత పశ్చాత్తాప పడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భార్యలకు ఉండే సాధారణ లక్షణం ఇది.
అలాగే స్త్రీలకు కోపం వచ్చినప్పుడు వారి బలహీనమైన పాయింట్లను తెలుసుకొని వారిని కాస్త పొగిడితే స్త్రీలు శాంతిస్తారు. భార్యలకు నచ్చిన పాటలు పాడడం, నచ్చిన ఆహారం, కాఫీ, టీ వంటి వాటిని చేసి వారి అలక తీర్చవచ్చు. అలాగే భర్త చేసిన పొరపాటును వారు తెలుసుకుని ఒక్కసారి స్వారీ చెప్పినా భార్య శాంతిస్తుంది. వారి కాపురంలో ఎలాంటి పొరపొచ్చాలు ఉండవు. భార్యకి కోపం వచ్చినప్పుడు భర్త అక్కడి నుంచి వెళ్లిపోతే భార్య మరింత కోపానికి గురవుతుంది. మగవారు చేసే పొరపాట్లలో ఇది కూడా ఒకటి. అలాగే వారు కోపం తెచ్చుకున్నప్పుడు వారిని శాంతపరచాలే కానీ తిరిగి కోప్పడరాదు.
భార్య ముందు భర్త... భర్త ముందు భార్య ఎప్పుడూ నిజాయితీగా ఉన్నప్పుడే ఆ కాపురంలో ఎలాంటి గొడవలు, తగాదాలు రాకుండా ఉంటాయట. ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలట. ఎప్పుడో ఒకసారి భర్త తన భార్యకు నచ్చిన వస్తువులను బహుమతిగా ఇవ్వాలట. వారి చేసిన పనులను ప్రశంసించాలట. భార్యపై ఎనలేని ప్రేమను కురిపించాలి.. అప్పుడే భార్యలు కూడా భర్తలను అపురూపంగా చూసుకుంటారని పెద్దలు చెబుతున్నారు.