లూజ్ వెజీనాతో ఆందోళన అక్కర్లేదు.. టైటెనింగ్‌కు సింపుల్ టిప్స్

by sudharani |
లూజ్ వెజీనాతో ఆందోళన అక్కర్లేదు.. టైటెనింగ్‌కు సింపుల్ టిప్స్
X

దిశ, ఫీచర్స్ : రెగ్యులర్ సెక్స్, ప్రసవం, మెనోపాజ్, వయసు ప్రభావంతో మహిళల్లో యోని వదులుకావడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ అంశం చుట్టూ అనేక అపోహలు ఉన్నాయి. దీర్ఘకాలంలో యోని స్థితిస్థాపకత కోల్పోతుందనేది కొందరి విశ్వాసం. కానీ పరిస్థితులకు తగ్గట్టుగా సాగవచ్చు లేదా కుదించబడవచ్చు అనేది నిపుణుల మాట. ఈ నేపథ్యంలో యోని కండరాలను బిగుతుగా, పటిష్టంగా మార్చడంలో సాయపడే కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచిస్తున్న గైనకాలజిస్ట్‌లు.. ఇందుకోసం పలు చిట్కాలను అందిస్తున్నారు.

* కెగెల్ వ్యాయామాలు: పెల్విక్ ఫ్లోర్.. గర్భాశయం, మూత్రాశయం, చిన్న ప్రేగులకు మద్దతునిస్తుంది. ఇక కెగెల్ వ్యాయామాలను పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి చేసే ముందు మొదట పెల్విక్ ఫ్లోర్ కండరాలను గుర్తించాలి. మొత్తానికి కెగెల్స్.. కండరాలను పటిష్టపరిచి యోనిని బిగుతుగా ఉంచడంలో సాయపడతాయి.

* పెల్విక్ టిల్ట్ ఎక్సర్‌సైజ్: పెల్విక్ టిల్ట్ ఎక్సర్‌సైజ్.. యోని, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందు కోసం గోడకు వ్యతిరేకంగా భుజాలు, బట్‌తో నిలబడాలి. ఆ తర్వాత వెన్నెముక వైపు బొడ్డు బటన్‌ను లాగి కనీసం 4 సెకన్ల పాటు కొనసాగించాలి.

* స్క్వాట్స్: కెగెల్ వ్యాయామాలతో పాటు స్క్వాట్స్ చేయడం అనేది కటి ప్రాంతాన్ని టోన్ చేయడంతో పాటు యోని కండరాలను బిగుతుగా చేస్తుంది. ఈ వ్యాయామం చేసేందుకు కాళ్లను చాచి తుంటిపై ఆధారపడి నిలబడాలి. ఆపై బెంచ్ మీద కూర్చున్నట్లుగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఈ విధానాన్ని చాలాసార్లు పునరావృతం చేయాలి.

* లెగ్స్ అప్ వ్యాయామం: గోడకు వ్యతిరేకంగా మీ కాళ్లను పైకి లేపాలి. వెజీనా టైట్‌నెస్, కటి కండరాలను పటిష్టపరిచేందుకు ఇది అద్భుతమైన వ్యాయామం.

* యోగా: పెల్విక్ ఫ్లోర్ కండరాల సంకోచం, విస్తరణకు యోగాసనాలు సాయపడతాయి. ఇక యోని ఆరోగ్యం కోసం తిత్లీ ఆసనం, ప్రసరిత పదోత్తనాసనం, చక్రాసనం, సుప్త వజ్రాసనాలను అభ్యసించవచ్చు. పెల్విస్‌తో కూడిన యోగా భంగిమలు కూడా యోనిని బిగుతుగా చేయడంలో సాయపడతాయి.

వెజీనా టైటెనింగ్‌తో ప్రయోజనాలు : పై చిట్కాలు యోని కుచించుకుపోయే లక్షణాలను మెరుగుపరచడంలో తోడ్పడుతాయి. చాలా మంది మహిళలు ఎదుర్కొనే వెజీనల్ డ్రైనెస్ సమస్యను వెజీనా టైట్‌నెస్ ద్వారా పరిష్కరించవచ్చు. ఇక మూత్రం ఆపుకోలేని లక్షణాలను మెరుగుపరచడమే కాక యోని బిగుతుగా ఉంటే ఇంటర్‌కోర్స్ టైమ్‌లో ఘర్షణ, ఇతరత్రా నొప్పి తగ్గుతుంది.

Advertisement

Next Story

Most Viewed