హర్యానా మ్యాన్ కిట్‌తో 20నిమిషాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్‌గా సైకిల్!

by sudharani |
హర్యానా మ్యాన్ కిట్‌తో 20నిమిషాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్‌గా సైకిల్!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం 'ఈవీ'(ఎలక్ట్రికల్ వెహికల్) హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హర్యానాకు చెందిన గురుసౌరభ్ సింగ్ ఎటువంటి సైకిల్‌నైనా కేవలం 20 నిమిషాల్లో మోటరైజ్డ్, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనం (EV)గా మార్చగల ఓ కిట్‌ను రూపొందించాడు. ఆ కిట్ విశేషాలు మీకోసం..

ఎనిమిది కోట్ల మంది భారతీయులు ప్రస్తుతం సైకిళ్లు, రిక్షాలను ప్రయాణానికి ఉపయోగిస్తుండగా, గురుసౌరభ్ రూపొందించిన DVECK (ధృవ్ విద్యుత్ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్) కిట్ వాటిలో ప్రతిదానికి అనుకూలంగా ఉంటుంది. మోటారును మార్చడం ద్వారా ఇప్పటికే ఉన్న వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రీట్రోఫిట్టింగ్ ఆలోచనతో ఆయన ప్రేరణతోనే దీన్ని తయారుచేసినట్లు వెల్లడించాడు.

ఇక DVECK ఫైర్‌, వాటర్‌ప్రూఫ్ కాగా 20 నిమిషాల పెడలింగ్‌తో ఇందులోని సాకెట్ ద్వారా ఫోన్ బ్యాటరీని 50 శాతం వరకు చార్జ్ చేయవచ్చు. ఒకసారి చార్జ్ చేస్తే 25 కిమీ వేగంతో సైకిల్ లేదా రిక్షా మీద 40 కిలోమీటర్ల వరకు దీనిపై వెళ్లొచ్చు. కిట్ ఇంకా ప్రజలకు అందుబాటులోకి రానప్పటికీ, గురుసౌరభ్ దీనిని త్వరలో మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

'మా హిసార్ గ్రామంలోని ప్రతీ ఇంటికి సోలార్ ప్యానెల్ ఉంటుంది. పట్టణ భారతదేశం కంటే నేడు గ్రామీణ భారతదేశానికి సుస్థిరత గురించి ఎక్కువ తెలుసు. చాలా మంది EVని కొనుగోలు చేస్తుంటారు కానీ లోతట్టు ప్రాంతాల జనాభా దానిని ఎలా ఉత్తమంగా ఉపయోగించుకుంటారనేదే ప్రశ్న. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అత్యధికంగా ఉన్నాయి. ఇక నా కిట్‌తో దేశంలోని ప్రతీ మూలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం దీని ధర అధికంగా ఉన్నప్పటికీ, మరింత బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రజలు పెట్రోల్/డీజిల్ వాహనాల నుంచి DVECK-ఆధారిత సైకిళ్లకు మారాలని కోరుకుంటున్నాను'

- గురుసౌరబ్

Advertisement

Next Story

Most Viewed