మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. మీ స్పెర్మ్ కౌంట్‌కు ముప్పు వాటిల్లినట్టే

by Sumithra |
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. మీ స్పెర్మ్ కౌంట్‌కు ముప్పు వాటిల్లినట్టే
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో చాలా మంది పురుషులు ఎదుర్కొనే సమస్యల్లో ఒక సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గడం. పురుషుడి వృషణాలలో అభివృద్ధి అయ్యే పురుష పునరుత్పత్తి కణం స్పెర్మ్. ఆరోగ్యంగా ఉన్న పురుషునిలో 40 నుంచి 300 మిలియన్ల స్పెర్మ్ ఒక మిల్లీలీటర్ వీర్యంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో దీని కౌంట్ తగ్గి ఎన్నో జంటలు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. స్పెర్మ్ తగ్గడం వలన వృషణాల క్యాన్సర్‌ వంటి సమస్యలు కూడా వస్తాయి. అసలు స్పెర్మ్ ఎలా తగ్గుతుంది.. దానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రైవింగ్ లో చేసే పొరపాట్లు..

చలికాలంలో కార్ డ్రైవింగ్ చేస్తూ చాలామంది కార్ లో హీటర్ ని ఆన్ చూసుకుంటారు. ఆ వేడి ప్రభావం వృషనాల పై పడి స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉంటే మానవ వృషణాలు స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసుకోగలదు. అధికంగా ఉండే వేడి స్పెర్మ్‌కు హాని కలిగించి ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతే కాదు బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించి ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి పెరిగినా..

పని విషయంలో, ఇంటి సమస్యలతో చాలా మంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అధికంగా ఒత్తిడికి గురయితే స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయిని నిపుణుల అభిప్రాయం. హార్మోన్‌ స్పెర్మ్ నాణ్యత, ఉత్పత్తి స్థాయి, సామర్థ్యాల పై ఒత్తిడి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి కారణంగా వృషణాలను కుదించుకు పోయి స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది.

రేడియేషన్‌..

స్పెర్మ్ నాణ్యత పై రేడియేషన్‌ ప్రతికూలంగా పనిచేస్తుంది. మనిషి వృషనాల పై రేడియేషన్ పడడం వలన స్పెర్మ్‌లో శక్తి తగ్గడం, స్పెర్మ్ నాణ్యత తగ్గడం, చలనశీలత తగ్గడం, ఆకారాన్ని మార్చడం వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే ధరించే ప్యాంటు జేబులో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, సెల్‌ఫోన్‌లు క్యారీ చేయడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

లైఫ్‌స్టైల్‌ మార్పులు..

ఒక వ్యక్తి లైఫ్‌స్టైల్‌ ఆ వ్యక్తి స్పెర్మ్ కౌంట్‌ పై ప్రభావం చూపిస్తుంది. స్పెర్మ్‌ కౌంట్‌ను, నాణ్యతను తగ్గిస్తుంది. అందుకే ఎక్కువగా స్మోకింగ్‌, డ్రగ్స్, ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవద్దని చెబుతుంటారు. పురుషాంగానికి రక్త సరఫరాను, సెమినల్ ఫ్లూయిడ్ ఉత్పత్తిని మత్తు పదార్థాలు తగ్గిస్తాయి.​ వయస్సు పెరిగినా కొద్దీ స్పెర్మ్ నాణ్యత, పరిమాణం కూడా తగ్గుతుంది.

స్పెర్మ్ కౌంట్ ఎలా పెంచుకోవాలి ?

వ్యాయామం చేయడం : రోజూ వ్యాయామం చేయడం వలన బాడీలో ఫిట్నెస్ పెరిగి టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

విటమిన్ సి : విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మీ ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.

మెంతులు తీసుకోవడం : మెంతికూర తినడం పురుషుల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed