- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శనివారం నాన్ వెజ్ తినొద్దనడానికి సైంటిఫిక్ రీజన్ ఉంది.. సైన్స్ ఏం చెబుతుందంటే?
దిశ, ఫీచర్స్: కొంతమందికి ఆదివారం వస్తే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగదు. మరికొంతమంది ప్రతిరోజూ నాన్ వెజ్ తినేవారుంటారు. నాన్ వెజ్ తినడం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టాలేం లేవు. మాంసాహారంలో ప్రోటీన్లు, విటమిన్ ఎ, బి, డి అండ్ జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైనంత బలాన్ని ఇస్తాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్-2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మాంసాహారం తినడం వల్ల దీర్ఘకాలికంగా ఎనర్జీ ఉంటుంది.
అయితే కొంతమంది వారంలో రెండు లేదా మూడు సార్లు ఫాస్టింగ్ పేరుతో నాన్ వెజ్ తినరు. ముఖ్యంగా చాలా మంది శనివారం మాంసాహారం జోలికి వెళ్లరు. అయితే శనివారం నాన్ వెజ్ ముట్టుకోకపోవడానికి సైంటిఫిక్ కారణముందంటున్నారు నిపుణులు. కామన్‌గా శనివారం అనగానే చాలా మంది ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే మరుసటి రోజే సండే కాబట్టి. చాలా మంది ఉద్యోగులకు అండ్ స్కూల్ కాలేజీ విద్యార్థులకు హాలీడే ఉంటుంది.
ఆదివారం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా గడపవచ్చు. ఈ తరుణంలో నాన్ వెజ్ వంటకాలను తీసుకుంటూ ఇష్టంగా తింటారు. కానీ శనివారం మాత్రం చాలా మంది నాన్ వెజ్ జోలికి వెళ్లరు. కలియుగ దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే మహా ప్రీతి. కాగా శనివారం వేంకటేశ్వర స్వామికి మొక్కుకుని భక్తితో ఫాస్టింగ్ ఉంటారు. మరికొందరు శని మహాత్ముడిని పూజించడం వల్ల.. ఇంకొందరు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆయన కోసం శనివారం మాంసాహారం తినకుండా ఉంటారు.
అయితే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే.. వారంలో ఒకరోజు కడుపు ఖాళీగా ఉంచుకునేందుకు చాలా మంది శనివారాన్ని ఎంచుకుంటారు అంటున్నారు నిపుణులు. ప్రతీ శనివారం భూమిపై చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో వాతావరణం దాదాపు చల్లగా ఉంటుంది. కాగా మనుషుల జీర్ణక్రియలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ కారణంగా శనివారం ఎక్కువగా ఆహారం తీసుకున్నా డైజేషన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల శనివారం నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా ఉండటం మేలని సైన్స్ చెబుతుంది.