- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
షాకింగ్ ఘటన.. పిల్లిని పీక్కు తిన్న యువకుడు

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వచ్చాక వింతలు వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఏ చిన్న సంఘటన జరిగినా సరే క్షణాల్లో మన ముందుఉంటుంది. అయితే ఎవరైనా ఆకలి అయితే చిప్స్ లేకపోతే ఏవైనా పండ్లు తింటారు. కానీ ఓ యువకు తిండి లేక పిల్లిని పీక్కుతిన్న వింత ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
అయితే అస్సాంకు చెందిన ఓ యువకుడు, తన ఫ్యామిలీకి చెప్పకుండా, కేరళకు వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లాక తనకు డబ్బులు లేకుండా అయిపోయాయి. కనిసానికి తినడానికి కూడా అతని వద్ద మనీ లేకుండా పోయాయి. దీంతో ఆయన ఐదు రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నాడు. ఈ క్రమంలో ఆకలి బాధను తట్టుకోలేకపోయిన ఆ యువకుడు చనిపోయిన పిల్లిని పీక్కతింటూ కనిపించాడంట. ప్రస్తుతం ఈ ఘటన అక్కడున్నవారిని దిగ్బ్రాంతికి గురిచేసింది.దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి తనకు ఆహారం పెట్టి తన వివరాలు సేకరించారు. ప్రస్తుతం యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.