ప్రపంచంలోనే మొట్టమొదటి, ఏకైక డాగ్-ఫాక్స్ మృతి

by Mahesh |
ప్రపంచంలోనే మొట్టమొదటి, ఏకైక డాగ్-ఫాక్స్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: 2021లో ఓ వాహన ప్రమాదంలో ప్రమాదవశాత్తు కనుగొనబడిన అసాధారణ హైబ్రిడ్ జాతి కుక్క, నక్క మరణించినట్లు తెలుస్తుంది. పలు నివేదికల ప్రకారం.. 'డాగ్జిమ్' జీవి 2021లో బ్రెజిల్‌లో కనుగొనబడింది. దీనిని పరిరక్షించేందుకు యూనివర్సిడేడ్ ఫెడరల్ డో రియో​గ్రాండే డో సుల్ వెటర్నరీ ఫెసిలిటీకి తరలించారు. అయితే అక్కడ నిర్వహించిన DNA పరీక్షలో ఈ జంతువు కనుగొనబడిన మొట్టమొదటి కుక్క-నక్క హైబ్రిడ్ అని తేలింది. అయితే ఈ జంతువు ఆరు నెలల క్రితం చనిపోయిందని.. దాని మరణాన్ని తెలియజేయడంతో నిర్లక్ష్యం చేయడంతో బ్రెజిల్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.2021 నవంబర్ నుండి, పంపాస్ ఫాక్స్-డాగ్ హైబ్రిడ్ సావో బ్రజ్ పరిరక్షణ ప్రదేశంలో నివసిస్తోంది. అది మరణించినందుకు మేము నిజంగా బాధపడ్డామని సైటోజెనిటిస్ట్ డాక్టర్ రాఫెల్ క్రెట్‌స్చ్మెర్ ది తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed