- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ ఏడుస్తారట.. సర్వేలో వెల్లడి
దిశ, ఫీచర్స్: అమ్మాయిలకే కాదు భావోద్వేగాలు ఎక్కువనీ, వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారని, ప్రతీ బాధాకరమైన సందర్భంలో ఏడుస్తారని అందరూ అంటుంటారు. అబ్బాయిలకేం మగమహారాజులు, ధైర్య వంతులు అని పొగిడేస్తుంటారు. కానీ అది వాస్తవం కాదట. బాధలు, భావోద్వేగాల సందర్భంలో అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగే బాధ పడతారని, ఏడుస్తారని 2000 మంది పురుషులపై Aveeno అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 82 శాతం మంది స్త్రీలతో పోలిస్తే 71 శాతం మంది పురుషులు తమ భావోద్వేగాల వేళ సెన్సిటివ్‌గా ఉంటారని, కంటతడి పెడతారని వెల్లడైంది.
సెన్సిటివ్‌గా భావించే వారిలో 41 శాతం మంది పురుషులు ఈ ఫీలింగ్స్‌ను తరచుగా లేదా ఎల్లప్పుడూ బహిరంగంగా ప్రదర్శిస్తుంటారు. ఇక 33 శాతం మంది తమ భావాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండటమే మనిషి లక్షణమని అభిప్రాయపడుతున్నారు. మరో 37 శాతం మంది పురుషులు తమను ‘సెన్సిటివ్’ అని పిలవడాన్ని కాంప్లిమెంట్‌గా భావిస్తున్నారు. అమ్మాయిల్లో 23 శాతం మంది మాత్రమే ఇలా భావిస్తారట. నిజానికి 24 శాతం మంది మహిళలు తమను ఎవరైనా సెన్సిటివ్‌గా ప్రస్తావిస్తే అవమానంగా భావిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. స్త్రీ, పురుషులు మొత్తంగా చూసుకుంటే 55 శాతం మంది తమ సెన్సిటివిటీని బహిర్గత పర్చడంవల్ల ఇతరులు తమను ఇష్టపడతారని అనుకుంటున్నారు.
మరో 48 శాతం మంది పురుషులకంటే మహిళలే సెన్సిటివిటీని ప్రదర్శించడంలో సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉంటుందని నమ్ముతున్నారు. సాధారణంగా అయితే 52 శాతం మంది సెన్సిటివ్‌గా చూడడాన్ని పాజిటివ్ లక్షణంగా భావిస్తారు. ఇక 44 శాతం మంది తమ కెరీర్‌లో విజయం సాధించడంలో ఒకరి సామర్థ్యానికి ఇది సహాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మెజారిటీగా 85 శాతం మంది కూడా వర్క్ ప్లేస్‌లో గుడ్ లీడర్‌గా, బెస్ట్ పెర్ఫర్మర్‌గా ఉండే వ్యక్తి కూడా సెన్సిటివ్‌గా ఉంటాడని చెప్తున్నారు. ఇక ఆయా పరిస్థితులను బట్టి అమ్మాయిల్లాగే ఆధునిక అబ్బాయిలందరూ తమ భావోద్వేగాలను ఫీల్ అవుతారని, ఏడుస్తారని నిపుణులు అంటున్నారు. కాకపోతే అమ్మాయిల్లో ఎక్కువమంది బయట పడుతుంటారని, అబ్బాయిల్లో లోలోనే కుమిలి పోతుంటారని చెప్తున్నారు.