- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెగిన వెంట్రుకల ఖరీదు రూ. 12 లక్షలు.. వేలం పాటలో 1200 మంది పోటీ
దిశ, ఫీచర్స్ : ప్రతి రోజూ ఏదో ఒక వస్తువును ఆన్‌లైన్‌లో వేలం వేస్తారు. అయితే ఒక్కోసారి వేలంలో కొన్ని వింత వస్తువులు కూడా చేరిపోతుంటాయి. వాటి గురించి తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుని షాక్ అవ్వాల్సిందే. మరీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వస్తువులను కొనుగోలు చేసేందుకు జనాలు కూడా పోటీపడుతుంటారు. ఇలాంటి ఒక విషయమే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఇటీవల తెగిపోయిన వెంట్రుకల వేలం జరిగింది. ఏంటి తెగిన వెంట్రుకలను వేలం వేయడం ఏంటి అనుకుంటున్నారా.. మరి అది సాధారణ జుట్టు కాదు, దక్షిణ కొరియాలో ప్రసిద్ధ బ్యాండ్ IVE గాయకురాలు జంగ్ వాన్-యంగ్ జుట్టు.
ఒక చైనీస్ అభిమాని ఇటీవల గాయకురాలు జంగ్ వాన్-యంగ్ మూడు తెగిన వెంట్రుకలను వేలం వేశారు. IVE ఒక కచేరీలో గాయకురాలి తెగిన జుట్టును తాను సేకరించినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఆ జుట్టు కోసం ప్రారంభ బిడ్ 9,999 యువాన్లు (అంటే రూ. 1.15 లక్షల కంటే ఎక్కువ) గా నిర్ణయించారు.
అంతే కాదు ఈ వెంట్రుకలు గాయకురాలివి కావాలంటే DNA పరీక్ష ద్వారా నిరూపించగలనని వేలం వేసిన నిర్వాహకుడు హామీ ఇచ్చాడు. ఈ ప్రత్యేకమైన వేలంలో 1200 మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 15 మంది ఉత్సాహంగా వేలం వేశారు. ఆ తర్వాత జుట్టు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
చివరికి గాయకురాలు జంగ్ వాన్-యంగ్ జుట్టును 1,03,000 యువాన్ లకు (అంటే రూ. 12 లక్షల కంటే ఎక్కువ) సొంతం చేసుకున్నారు. ఈ వేలం ఇప్పుడు చైనీస్ సోషల్ సైట్ వీబోలోలో చర్చనీయాంశంగా మారింది. వేలం పోస్ట్‌ను 9 కోట్లకు పైగా వీక్షించారు.
ఈ వీడియోను చూసిన కొంతమంది దీనిని స్కామ్ అని పేర్కొన్నారు. రుజువు లేకుండా ఆ జుట్టు గాయకురాలు జంగ్ వాన్-యంగ్‌దేనని ఎలా నమ్ముతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. IVE కచేరీలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. అలాంటప్పుడు గాయకురాలి జుట్టును సేకరించడం కష్టం అంటున్నారు.