దేవతల మాదిరిగానే ఈ జెల్లీ ఫిష్‌కు మరణం లేదు..!!

by Prasanna |   ( Updated:2023-07-24 14:42:52.0  )
దేవతల మాదిరిగానే ఈ జెల్లీ ఫిష్‌కు మరణం లేదు..!!
X

దిశ, ఫీచర్స్ : మరణం లేకుండా ఎప్పటికీ జీవించి ఉంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన మీకెప్పుడైనా కలిగిందా? ప్రపంచంలో వృద్ధాప్యం, మరణం లేని జీవజాతులేమైనా ఉన్నాయా అనే ప్రశ్న మీలో మెదిలిందా? అయితే అలాంటి జీవి ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ‘ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్’కు మరణం లేదని, శాశ్వతంగా జీవిస్తుందని అంటున్నారు. ఎందుకంటే దాదాపు 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల మరణానికి చాలా ముందు నుంచే ఈ చిన్న జీవులు మానవులకు తెలుసు. కానీ ఆశ్చర్యంగా మిలియన్ల సంవత్సరాలు జీవించగల సామర్థ్యం కలిగి ఉంటున్నాయని తాజాగా నిర్ధారించారు నిపుణులు.

జెల్లీ ఫిష్ (టర్రిటోప్సిస్ డోహ్ర్ని జాతి) వృద్ధాప్యం లేదా తన శరీరం దెబ్బతిన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పటి పాలిప్ దశకు తిరిగి రావడం ద్వారా మరణాన్ని తప్పించుకోగలుగుతున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. జెల్లీ ఫిషెస్ కొత్త వయోజన రూపాలను ఉత్పత్తి చేయగలగడం జన్యుపరమైన పాలిప్‌తో ముడిపడి ఉంటాయని చెప్తున్నారు. మొట్టమొదట 1883లో జెల్లీ ఫిష్‌ల శాశ్వత జీవితం గురించి శాస్త్రవేత్తలు వర్ణించారు. కానీ ఒక శతాబ్దం తర్వాత వాటి జీవిత చక్రాన్ని ప్రయోగశాలలో బంధించడం ద్వారా గమనించారు. అమర జెల్లీ ఫిష్‌ల కాలనీలు పాలిప్ దశలోకి తిరోగమించవచ్చని, రెండేళ్లలో పదిసార్లు మళ్లీ జీవితాన్ని ప్రారంభించవచ్చని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇమోర్టల్ జెల్లీ అనేది లైంగిక పునరుత్పత్తి తర్వాత తనను తాను పునరుద్ధరించుకోగల ఏకైక జాతిగా ‘జీవశాస్త్రపరంగా అమరత్వం’ చెందుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story