Fever: జ్వరం రావడం వల్ల లాభాలే ఎక్కువంటూ.. సర్వేలో బయటపెట్టిన నిపుణులు

by Prasanna |
Fever: జ్వరం రావడం వల్ల లాభాలే ఎక్కువంటూ.. సర్వేలో బయటపెట్టిన నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి దీని వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరికైతే ఇవి ఎటాక్ చేయగానే జ్వరం వస్తుంది తగ్గే వరకు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. కానీ, ఫీవర్ రావడం మంచిదని నిపుణులు వెల్లడించారు. ఏడాదిలో ఒకసారైనా జ్వరం రావాలని అంటున్నారు. దీని వలన ఇమ్మ్యూనిటీ పెంచుకోవడంతో పాటు ముందు ముందు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను సులభంగా ఎదుర్కొవచ్చని తాజా సర్వేలో తేలింది.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. పీల్చే గాలి ద్వారా ఎన్నో రకాల సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశిస్తాయి. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 37°c ఉండాలి. అయితే, జ్వరం వచ్చిన మనిషికి శరీర ఉష్ణోగ్రత బాగా పపెరిగిపోతుంది. దీంతో హాని కలిగించే వైరస్, సూక్ష్మజీవుల నశిస్తాయని వైరాలజీ అధ్యయనం వెల్లడించింది.

వరల్డ్ లోని 6 అధ్యయనాలు దీని మీద ఎన్నో పరిశోధనలు చేసి తెలిపాయి. అలాగే ఫీవర్ వస్తే ఎన్నో లాభాలను ఉన్నాయని అంటున్నారు. జ్వరం వస్తే శరీర ఉష్ణోగ్రత పెరిగి దీంతో రోగా నిరోధక వ్యవస్థకు పని చేసే తెల్ల రక్త కణాలు అలర్ట్ అయిపోతాయి. బ్యాక్టీరియా వైరస్‎ల కట్టడి చేస్తాయి. దీంతో ఇమ్మ్యూనిటీ పెరుగుతుందని ఇమ్యునాలజీ తెలిపింది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Next Story