Aliens : భూమిని సందర్శిస్తున్న ఎలియన్స్.. రుజువులు ఉన్నాయట

by Prasanna |   ( Updated:2023-06-26 07:07:08.0  )
Aliens : భూమిని సందర్శిస్తున్న ఎలియన్స్.. రుజువులు ఉన్నాయట
X

దిశ, ఫీచర్స్ : అది ఇంగ్లండ్‌లో గల డెవాన్‌ సమీపంలోని ఒక గ్రామీణ ప్రాంతం. ఆకాశంవైపు చూస్తున్న యూఫోలజిస్ట్ క్లామిడ్‌ను ఒక వింత దృశ్యం ఆకర్షించింది. అది కాంతిని వెదజల్లుతూ మేఘాలవైపు దూసుకెళ్తోంది. అయితే వెంటనే తన డిజిటల్ కెమెరాతో స్నాప్ చేసిన అతను, ఆ వింత ఆకారం మరేదో కాదని, ‘ఎలియన్ ఫ్లయింగ్ సాసర్’ అని పేర్కొన్నాడు. గ్రహాంతరవాసులు భూమిని సందర్శిస్తాయనడానికి ఇదే కచ్చితమైన సాక్ష్యమని చెప్తున్నాడు. కెమెరాలో జూమ్ చేసి చూస్తున్నప్పుడు ఆ ఎలియన్ సాసర్ గంటకు 1,000 మైళ్ల వేగంతో మేఘాలలో దూసుకుపోయిందని తెలిపాడు. ఇది పూర్తిగా వాస్తవమైందని, గ్రహాంతరవాసుల ఉనికి నిజమైందని అతను బలంగా నమ్ముతున్నాడు.

గ్రహాంతర వాసులు భూమిని సందర్శిస్తుంటారని పేర్కొనే ఇటువంటి రుజువులు వెలువడడం ఇదేం మొదటిసారి కాదని, తరచుగా అనుమానిత, గుర్తు తెలియని ఫుటేజీలు బయటకు వస్తుంటాయని నాసా సైంటిస్టులు అంటున్నారు. మూడు దశాబ్దాలలో ఇలాంటి 800 వీక్షణలను తాము గమనించామని, వాటిలో 2 నుంచి 5 శాతం మాత్రమే వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. మిగతావి ఎలియన్‌లను పోలినట్లు కనిపిస్తున్నప్పటికీ పరిశోధనా పరంగా రుజువు కాలేదని వెల్లడించారు. గతంలో లాస్ వెగాస్‌లో, కాలిఫోర్నియా సైనిక స్థావరం వద్ద కూడా ఎలియన్లు ల్యాండ్ అయినట్లు వార్తలు వినిపించాయని, ఫుటేజీలు బయటకు వచ్చాయని గుర్తు చేశారు. అయితే వాటి ఆధారంగా మాత్రమే కచ్చితమైన నిర్ధారణకు రాలేమని, పరిశోధనలో రుజువు కావాలని, ఇప్పటి వరకు అలాంటిదేం జరగలేదని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed