- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సింగిల్స్.. మింగిల్స్.. ఆ విషయంలో శాటిస్‌ఫాక్షన్ ఎక్కువగా వాళ్లకే..

దిశ, ఫీచర్స్ : ఒక బంధంలో ప్రేమ.. ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వం, ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుంది. బొమ్మరిల్లు సినిమాలో చెప్పినట్లు ముందు నాలో ఏదైతే నచ్చింది అన్నావో.. ఇప్పడు అదే నచ్చలేదు అంటున్నావ్.. అనే పరిస్థితి వచ్చి.. అన్ని విధాలుగా ఆ మనిషి లక్షణాలనే మార్చేస్తుంది. మరి మింగిల్ అవడం ఇంత చేంజ్‌కు కారణమైతే.. జీవితాంతం సింగిల్‌గానే ఉన్న వ్యక్తి సంగతేంటి? వారిలో ఎలాంటి మార్పులుండవా? ఈ ప్రశ్నకు సంబంధించి అధ్యయనం చేపట్టిన శాస్త్రవేత్తల బృందం.. సింగిల్స్, మింగిల్స్ మధ్య వ్యక్తిత్వ వ్యత్యాసాలు, జీవితంలో సంతృప్తి స్థాయిల గురించి సర్వే చేసింది. 22 నుండి 105 సంవత్సరాల మధ్య వయసున్న77,000 మందికి పైగా పాల్గొన్న సర్వే ఆఫ్ హెల్త్, ఏజింగ్, అండ్ రిటైర్మెంట్ ఇన్ యూరప్ (SHARE) నుంచి డేటాను పరిశీలించింది.
జీవితాంతం ఒంటరిగా ఉన్నవారు బంధాల్లో ఉన్న వారితో పోలిస్తే తక్కువ స్థాయి జీవిత సంతృప్తిని చూస్తారని కనుగొన్నారు. ఇది ఎప్పుడూ ఎటువంటి సంబంధాలలో లేని వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అధిక ఆదాయం ఉన్న సింగిల్స్ అంత తక్కువ జీవిత సంతృప్తిని అనుభవించకపోవచ్చని కూడా అధ్యయనం హైలైట్ చేసింది. ఆర్థిక స్థిరత్వం ఉపశమనం ఇస్తుందని సూచిస్తుంది.
సంబంధాలలో ఉన్న వారితో పోలిస్తే జీవితాంతం ఒంటరిగా ఉన్నవారు బహిరంగంగా మాట్లాడేందుకు, సామాజికంగా కనెక్ట్ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుంది. మనస్సాక్షి, బాధ్యతాయుతంగా ఉండే అవకాశం తక్కువ. ఈ లక్షణాలు ముఖ్యంగా వృద్ధ సింగిల్స్‌లో ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం, ఆర్థిక సమస్యలతోపాటు అదనపు సవాళ్లు కూడా ఎదుర్కోవచ్చు. వీరికి సామాజిక మద్దతు కూడా తక్కువే. కాగా జీవితాంతం ఒంటరిగా ఉన్న వారికి లైఫ్ శాటిస్‌ఫాక్షన్ తగ్గడం విశేషం.