వాతావరణ మార్పులపై పోరాటానికి 'జంతువుల మేత' కీలకం!

by Hamsa |   ( Updated:2022-10-20 15:15:27.0  )
వాతావరణ మార్పులపై పోరాటానికి జంతువుల మేత కీలకం!
X

దిశ, ఫీచర్స్ : పర్యావరణ వ్యవస్థలో సాయిల్(నేల) కార్బన్ పూల్‌ను స్థిరీకరించడంలో జంతువుల మేత కీలకమైంది. జీవావరణ వ్యవస్థలో శాకాహారులు ఎలాగైతే కీలక పాత్ర పోషిస్తాయో, మేత లేకపోవడం ప్రపంచ కార్బన్ చక్రంపై ప్రతికూల పరిణామాలను కలిగిస్తుందని 16 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనం వెల్లడించింది. సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ (CES), దివేచా సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్(DCCC), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో మేతను ప్రయోగాత్మకంగా తొలగించడం వల్ల నేల కార్బన్ స్థాయిలో హెచ్చుతగ్గులు పెరిగాయని తేలింది.

CESలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన సుమంత బాగ్చి.. హిమాలయ పర్యావరణ వ్యవస్థలపై జంతువులను మేపడం వల్ల కలిగే ప్రభావాన్ని అధ్యయనం ప్రారంభించాడు. 2005లో ఈ పరిశోధన ప్రారంభం కాగా.. తన బృందంతో కలిసి కంచెతో కూడిన ప్లాట్లతో పాటు(జంతువులు మినహాయించబడ్డాయి) యాక్, ఐబెక్స్ వంటి జంతువులను మేపే ప్లాట్లను ఏర్పాటు చేశాడు. ఈ ప్రాంతాల నుంచి ఒక దశాబ్దం పాటు మట్టి నమూనాలను సేకరించి, వాటి రసాయన కూర్పును విశ్లేషించారు. ఏడాది తర్వాత ప్రతి ప్లాట్‌లోని కార్బన్, నత్రజని స్థాయిలను ట్రాక్ చేస్తూ పోల్చి చూశారు. అయితే ఒక ఏడాది నుంచి మరొక ఏడాది వరకు, ప్రతి ఏటా మరింత స్థిరంగా ఉండే గడ్డితో పోలిస్తే, జంతువులు లేని కంచె ప్లాట్లలో నేల కార్బన్ స్థాయిలు 30-40% ఎక్కువగా హెచ్చుతగ్గులకు గురైనట్లు వారు కనుగొన్నారు.

కార్బన్ హెచ్చుతగ్గులకు కీలకమైన అంశం నైట్రోజన్ అని పరిశోధకులు కనుగొన్నారు. ఇది నేల పరిస్థితులపై ఆధారపడి కార్బన్ పూల్‌ను స్థిరీకరించవచ్చు లేదా అస్థిరపరచవచ్చు. అయితే కార్బన్ చేరడం లేదా కోల్పోవడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియగా వారు భావించారు. కానీ తమ డేటాలో గమనించిన ఇంటర్నల్ హెచ్చుతగ్గులు చాలా భిన్న చిత్రాన్ని అందించాయి. ఈ మేరకు భూ ఉపరితలంలో 40% మేత పర్యావరణ వ్యవస్థలు ఉన్నందున, వాతావరణ మార్పులను తగ్గించేందుకు సాయిల్ కార్బన్‌ను స్థిరంగా ఉంచే శాకాహారులను రక్షించడం కీలకమైన ప్రాధాన్యతగా ఉండాలని పరిశోధకులు వాదించారు.

ఇవి కూడా చదవండి :

వామ్మో.. న్యూస్ పేపర్‌లో పెట్టిన ఫుడ్ తింటున్నారా.. ఆ సమస్యలు తప్పవు!

Advertisement

Next Story

Most Viewed