- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లీ బిడ్డల సన్నిహిత సంబంధం.. ప్రీ మెచ్యూర్ బేబీస్ లో పెరుగుతున్న మనుగడ
దిశ, ఫీచర్స్: నెలలు నిండకముందే పుట్టిన శిశువులు, సాధారణంకంటే తక్కువ బరువుతో జన్మించిన పిల్లలు బతికే అవకాశం తక్కువ. కానీ అలా జన్మించినప్పటికీ తల్లీ బిడ్డల మధ్య సన్నిహిత సంబంధం, స్కిన్ టు స్కిన్ కాంటాక్టు పద్ధతిని కలిగి ఉండే ‘కంగారు మదర్ కేర్’ సంరక్షణ పద్ధతి శిశువుల మనుగడ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని ఇటీవల భారత దేశంలో నిర్వహించిన పలు అధ్యయనాల సమీక్షలో వెల్లడైంది. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా క్లినికల్ స్టెబిలైజేషన్ తర్వాత తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ఈ విధమైన పద్ధతిని అవలంభించాలని సిఫార్సు చేస్తోంది.
శిశువు పుట్టిన 24 గంటలలోపు, రోజుకూ కనీసం 8 గంటలపాటు శిశువు తల్లితో స్కిన్ టు స్కిన్ కాంటాక్టులో ఉండే కంగారు మదర్ కేర్ (KMC) అని పిలిచే సంరక్షణ పద్ధతిలో శిశువు మనుగడతోపాటు మరణాలు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయని పరిశోధనలు పేర్కొన్నాయి. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER), పుదుచ్చేరి అండ్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్, న్యూ ఢిల్లీ) పరిశోధకులు ఈ అంశంపై అనేక దేశాలకు సంబంధించిన సమాజ ఆధారిత రాండమైజ్డ్ ట్రయల్స్‌ను కూడా సమీక్షించారు. నవజాత శిశువుల్లో సీఎంసీ ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి 31 ట్రయల్స్‌లో 15,559 మంది శిశువులను స్టడీ చేశారు. ఇందులో 27 స్టడీస్ కేఎంసీని సంప్రదాయ సంరక్షణతో పోల్చారు. నాలుగు కేఎంసీలు ఆలస్యంగా ప్రారంభించడం ద్వారా పోల్చబడ్డాయి. అయితే సంప్రదాయిక సంరక్షణతో పోలిస్తే, కంగారు మదర్ కేర్ అనేది ప్రీ మెచ్యూర్ బేబీస్‌లో పుట్టిన 28 రోజులలో మరణాల ప్రమాదాన్ని 32 శాతం తగ్గించినట్లు, అలాగే సెప్సిస్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని 15 తగ్గించినట్లు పరిశోధకులు కనుగొన్నారు.
Read more: పెళ్లికి ముందున్న లవ్ స్టోరీ కాబోయే భార్యకు చెబితే జరిగేది ఇదేనంట?