సారీ అమ్మాయిలు.. నా భార్య చాలా స్ట్రిక్ట్..

by sudharani |   ( Updated:2023-03-15 03:16:35.0  )
సారీ అమ్మాయిలు.. నా భార్య చాలా స్ట్రిక్ట్..
X

దిశ, ఫీచర్స్: ఆటో రిక్షాలు, ట్రక్కుల వెనుక కనిపించే ఫన్నీ అండ్ సెటైరికల్ కోట్స్.. ఒక్కోసారి ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తే, మరోసారి చూడగానే నవ్వొచ్చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ వెహికిల్ వెనకాల ప్రింట్ చేయించిన స్పెషల్ నోటీస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వంశిక గార్గ్ పోస్ట్ చేసిన ట్వీట్‌లో.. ‘సారీ గర్ల్స్.. మై వైఫ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్’ అనే మెసేజ్‌ను స్టిక్ చేశాడు సదరు డ్రైవర్ ధృవ. మద్యపానం నిషేధం అన్నట్లుగా.. ‘అమ్మాయిలు నిషేధం’ అని సింబాలిక్‌గా చెప్పేశాడు.

ఇక ఈ మెసేజ్‌పై స్పందిస్తున్న నెటిజన్స్.. నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ‘భార్యకు విశ్వాసంగా ఉండటంలో ఈయనకు 10000% ఇవ్వొచ్చు’ అని కామెంట్ చేస్తున్నారు. ‘అయ్యయ్యో నువ్విలా చేస్తే ఆడపిల్లలు బతికేదెలాగా’ అని కొందరు అంటుంటే.. మరికొందరు ‘ఆటోడ్రైవర్ భార్యే ఈ పని చేసిందని బెట్ కడుతాం’ అని చెప్పుకొస్తున్నారు. ‘మంచి పని చేశావ్ అబ్బాయి.. తప్పుడు ఆరోపణలు చేసి మానసికంగా హింసిస్తున్న వారికి దూరంగా ఉండేందుకు ఇది బెస్ట్ ఆలోచన’ అని మరికొందరు రిప్లయ్ ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed