- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Skin Care Tips: మిల్క్ పౌడర్‌తో మేని సౌందర్యం.. ఇలా వాడితే చాలు!
దిశ, ఫీచర్స్: మిల్క్ పౌడర్ గురించి అందరికీ తెలిసిందే. పాలు దొరకనప్పుడు టీ పెట్టుకోవడానికి, తాగడానికి ఈ పాలపొడిని నీళ్లల్లో కలిపి ఉపయోగిస్తుంటారు. ఆ క్షణంలో పాలకు ప్రత్యామ్నాయం తప్పితే దీనివల్ల ఆరోగ్యానికి పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. కాకపోతే ఇది చర్మ సంరక్షణకు, మేనిసోయగానికి ఉపయోగించుకోవచ్చునని నిపుణులు చెప్తున్నారు. మిల్క్ పౌడర్‌లో లాక్టిక్ యాసిడ్, బి.కాంప్లెక్స్ వంటివి ఉంటాయి. అందాన్ని రెట్టింపు చేస్తాయి.
* పాలపొడిని స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, మాయిశ్చరైజేషన్‌కు ఉపయోగించడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. చర్మంలో తేమను స్టోర్ చేయడంలో అది హెల్ప్ అవుతుంది. స్కిన్ అలెర్జీలు, దద్దుర్లు, దురద వంటివి తగ్గుతాయి. అలాగే పాలపొడి, శెనగపిండి, ఆరెంజ్ జ్యూస్ కలిపి ఫేస్ స్ర్కబ్ తయారు చేసుకోవచ్చు. దీనిని స్కిన్‌పై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగితే చాలు. చర్మం మెరిసిపోతుంది.
* పెరుగు, నిమ్మరసం, పాలపొడిలో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే బెస్ట్ రిజల్ట్ చూస్తారు. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి ముఖం కడుక్కుంటే చిన్న చిన్న మచ్చలు పోతాయి. ముఖ వర్చస్సు పెరుగుతుంది. అలాగే ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, మిల్క్ పౌడర్ కలిపి ప్యాక్ తయారు చేసుకొని వాడితే చర్మం నిగనిగలాడుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
- Tags
- Skin Care Tips