- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
కనిమొళి అభినందించింది.. తనకిష్టమైన డ్రైవర్ ఉద్యోగం పొయింది ? .. ఏం జరిగిందంటే

దిశ,వెబ్‌డెస్క్: కొయంబత్తూర్ నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా చేరి చక్కగా విధులు నిర్వర్తిస్తూ ఓ యువతి అందరి మన్ననలు పొందింది. ఇప్పుడు ఆ మహిళా డ్రైవర్ షర్మిల తన ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఇబ్బందులు పడుతోంది. ఓ రోజు ఆమె నడిపే బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేసింది. ఆ రోజే ఆమె తన డ్రైవర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. మహిళా డ్రైవర్ కావడంతో అందరి దృష్టి ఆమె పైనే ఉండేది. ఎంతో చలాకీగా విధులు నిర్వహిస్తూ ఉండే షర్మిలకు ఆ పరిస్థితి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఆమె బస్సు నడిపే వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ అయింది. తమకు షర్మిల ఆదర్శమంటూ యువత మీడియా ముందుకు వచ్చారు. అందరూ షర్మిలాతో సెల్ఫీలు దిగడం మొదలు పెట్టారు. దీంతో ఆమెకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే.. ఓ రోజు ఎంపీ కనిమొళి ఆమె బస్సు ఎక్కి ఆమెను అభినందించారు. ఎంపీ కార్యకర్తలతో పాటు బస్సు ప్రయాణం చేసింది. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కాని పలువురు కార్యకర్తలకు, ఆ బస్సులోని లేడీ కండక్టరుకు మధ్య వివాదం తలెత్తింది. దీంతోనే అసలు సమస్య మొదలైంది. ఆ లేడీ కండక్టర్ టికెట్టుకు చిల్లర ఇవ్వాల్సిందేనని కనిమొళితో పాటు కార్యకర్తలపై ఒత్తిడి తేవడంతో గొడవ జరిగినట్లు సమాచారం. ఏం జరిగిందో.. ఏంటో వివాదం సద్దుమనిగిన తర్వాత మహిళా డ్రైవర్ షర్మిల గాంధీపురం స్టాప్‌లో బస్సును నిలిపివేసి దిగి వెళ్లిపోయింది.
అయితే తనను అభినందించిన ఎంపీ కనిమొళి పట్ల ఆ మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని షర్మిలా సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆమె ఓ వీడియోలో చెప్పారు. షర్మిలాకు వ్యక్తిగత పబ్లిసిటీ పెరిగిందనీ, అయినా భరించాం కాని తనను డ్రైవర్ ఉద్యోగంలోంచి మాత్రం తీసివేయలేదని యజమాని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం అంతా కనిమొళికి తెలియడంతో కనిమొళి సహాయకులు షర్మిలతో మాట్లాడినట్లు సమాచారం.