- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చార్మినార్ పాత బస్టాండ్ వద్ద పార్కింగ్ కాంప్లెక్స్
by Gantepaka Srikanth |

X
దిశ, తెలంగాణ బ్యూరో: చార్మినార్ పాత బస్టాండ్ స్థలంలో పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్‌లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సోషల్ మీడియా(X) ద్వారా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీసుకెళ్లారు. పరిశీలించిన సీఎం వెంటనే సంబధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో చార్మినార్ పాతబస్టాండ్ స్థలాన్ని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్(ట్రాఫిక్) వేణుగోపాల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అధికారులను ఏ మోడల్‌లో పార్కింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశముందని గుర్తించారు. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
Next Story