Sravana masam: వరలక్ష్మి వ్రతంలో & శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు.. అలా మాత్రం చేస్తే అంతే సంగతి!

by Anjali |   ( Updated:2024-08-15 09:21:14.0  )
Sravana masam: వరలక్ష్మి వ్రతంలో & శ్రావణ మాసంలో ప్రతి  ఒక్కరూ పాటించాల్సిన నియమాలు.. అలా మాత్రం చేస్తే అంతే సంగతి!
X

దిశ, ఫీచర్స్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు(ఆగస్టు 16) అంగరంగ వైభవంగా సామూహిక వరలక్షి వ్రతాలు జరుపుకోననున్నారు. వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అని అంటారు. వర అనగా శ్రేష్ఠమైందని, వరాలిచ్చే తల్లి అని తెలుగు ప్రజలంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. ఆ రోజంతా ఏమి తినకుండా ఉపవాసం ఉంటారు. వరలక్షి వ్రతం రోజు ఏ ఇల్లు చూసినా దేవాలయంగా మెరిసిపోతుంది. కోరిన కోరికలన్నీ నెరవేరాలని మహిళలంతా ఇంటిని చక్కగా అలంకరించి అమ్మవారిని పూజిస్తారు.

సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం.. శ్రావణమాసంలో వచ్చిన వరలక్ష్మి వ్రతం నాడు కొత్తగా వివాహం అయిన దంపతులు ఫాస్టింగ్ ఉంచి లక్ష్మిదేవికి పూజ చేస్తే మంచి జరుగుతుందంటారు. భోగ భాగ్యాలు, అష్టైశ్వరాలు, సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. అయితే తాజాగా పండితులు చెప్పిన ప్రకారం వరలక్ష్మి వ్రతం నాడు ప్రతి ఒక్క అమ్మాయి ఈ నియమాలు పాటిస్తే ఈ ఏడాదంతా మేలు జరుగుతుందని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ శ్రావణ మాసంలో అండ్ రేపు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తప్పకుండా అమ్మాయిలు చేతికి ధరించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. నుదుట స్టిక్కర్స్ లాంటివి కాకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కాళ్లకు పసుపు రాసుకోవాలి. తలలో పువ్వులు పెట్టుకోవాలి. అంతేకాకుండా కళ్లకు కాటుక పెట్టుకోవడం కూడా మంచిదేనని అంటున్నారు. ఇలా చక్కగా తయారై లక్ష్మిదేవికి ఇష్టమైన పువ్వులతో పూజ చేసినట్లైతే సంవత్సరం పొడవునా మీకు అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. పూజలో కూర్చునప్పుడు ఎట్టిపరిస్థితిల్లోనూ పాత బట్టలు ధరించొద్దని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల మంచి జరగకపోవచ్చంటున్నారు. కాగా ఇంట్లో కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు ధరించి పూజలో కూర్చోవాలి. ఇలా చేస్తే అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారట.

గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధ‌ృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed