శిక్ష : హామీలు నెరవేర్చని నాయకుడిని నదిలో ముంచేసిన జనం

by sudharani |   ( Updated:2023-05-11 14:09:00.0  )
శిక్ష : హామీలు నెరవేర్చని నాయకుడిని నదిలో ముంచేసిన జనం
X

దిశ, ఫీచర్స్: రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో హామీలు ఇస్తుంటారు. ఇంటింటికీ తిరిగి ఓట్ల గురించి అభ్యర్థిస్తుంటారు. అయితే గెలిచాక మాత్రం మళ్లీ జనాన్ని కలవడం తక్కువే.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం మామూలే. పొలిటిషియన్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నా వారిని ప్రశ్నించడం అరుదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేయడం కరువు. చాలా దేశాల్లో ఇదే పంథా కొనసాగుతుండగా.. ఇటాలియన్ సిటీ ట్రెంటోలో మాత్రం అలా జరిగితే ఓటరే శిక్షిస్తాడు. ‘టోంకా’ అని పిలువబడే శిక్షలో మాట నిలబెట్టుకోని నాయకుడిని ఒక పంజరంలో బంధించి నదిలో వదిలేస్తారు. ఇలా కాసేపు ఉన్న తర్వాత రిలీజ్ చేస్తారు. ఈ విధంగా తప్పు చేస్తున్న పొలిటిషియన్‌ను రియలైజ్ చేస్తారు.

ప్రతి సంవత్సరం జూన్ రెండవ భాగంలో పట్టణం జరుపుకునే విజిలియన్ వేడుకల్లో భాగంగా ఇది జరుగుతుంది. వేడుకల సమయంలో జరిగే ప్రధాన కార్యక్రమాలలో ఒకటైన దీన్ని కోర్టు ఆఫ్ పెనిటెన్స్ అని పిలుస్తారు. ఇక్కడ రాజకీయ నాయకులు, పట్టణానికి చెందిన ప్రసిద్ధ వ్యక్తులు మాట తప్పి జనాన్ని అవమానించినందుకు విచారణలో ఉంచబడతారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన నేతలను బహిరంగంగా అపహాస్యం చేసే విధంగా శిక్షించబడతారు.

ఇవి కూడా చదవండి:

ముగ్గురికి పుట్టిన తొలి బిడ్డ.. కాంట్రవర్షియల్ ట్రీట్మెంట్ సక్సెస్

Advertisement

Next Story