ఇక ఫ్యాటీ‌ఫుడ్ తీసుకున్నా పర్లేదు.. స్లిమ్‌గా మార్చగల కొత్త మెడిసిన్ వచ్చేసింది

by Prasanna |   ( Updated:2023-08-07 07:18:35.0  )
ఇక ఫ్యాటీ‌ఫుడ్ తీసుకున్నా పర్లేదు.. స్లిమ్‌గా మార్చగల కొత్త మెడిసిన్ వచ్చేసింది
X

దిశ, ఫీచర్స్ : హైలీ షుగర్, ఫ్యాట్ కంటెంట్ కలిగిన ఆహారాలు తరచూ తీసుకోవడం వల్ల చాలా మందిలో ఒబేసిటీ ప్రాబ్లమ్ పెరుగుతుంది. అయితే ఇటువంటి యమ్మీ ఫుడ్ ఎంత తిన్నా లావెక్కకుండా, బరువు పెరగకుండా స్లిమ్‌గా ఉంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజమైతే బాగుండు అనిపిస్తోంది కదూ. అవును ఇక ముందు మీ ఊహ తప్పక సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని శాన్ ఆంటోనియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు అంటున్నారు. వీరు లైఫ్ లాంగ్ అధిక చక్కెరలు, కొవ్వు కలిగిన పదార్థాల్ని తీసుకునే ఎలుకలపై చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఫ్యాటీ అండ్ హైలీ షుగర్ ఫుడ్ తీసుకున్నప్పటికీ అధిక బరువు, ఊబకాయ సమస్యను నివారించడంతో‌పాటు కాలేయాన్ని రక్షించగలిగే చిన్న అణువుల ఔషధాన్ని(small-molecule drug) డెవలప్ చేశారు. అనారోగ్యకరమైన ఆహారాల వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందట.

పరిశోధకులు తాము తయారు చేసిన కొత్త ఔషధం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మొదట జీవక్రియలో మెగ్నీషియం ఎటువంటి రోల్ పోషిస్తుందో గమనించారు. ఇది కణాలలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేందుకు దోహదం చేసే ప్రక్రియ. అయినప్పటికీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను, బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించడంలో, బోన్ హెల్త్ వంటి ఇతర సమస్యలను నివారించడంలో కీ రోల్ పోషిస్తుందని.. మైటోకాండ్రియా అని పిలువబడే ఒక పదార్థం సెల్యులార్ పవర్‌ప్లాంట్స్‌లో మెగ్నీషియం ఎనర్జీని స్లో డౌన్ చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. మైటోకాండ్రియాలోకి మెగ్నీషియం రవాణాను ప్రోత్సహించే MRS2 అనే నిర్దిష్ట జన్యువును తొలగించడం ద్వారా ఇది కణాల్లో శక్తికి సంబంధించిన చక్కెర, కొవ్వు పదార్థాల జీవక్రియను నియంత్రించడం ద్వారా ఎలుకల్లో అధిక బరువు, ఊబకాయం సమస్యను నివారించింది. ఇదే ప్రక్రియను మానవులకు వర్తింపజేసినా అధిక కొవ్వు, చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల ఎదురయ్యే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్‌ను నివారించవచ్చని అంటున్నారు. మెడికేషన్ తయారీ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసినట్లు పరిశోధకులు తెలిపారు.

Read More: మీరు యాక్టివ్‌గా పనిచేయాలా?.. అయితే ఈ హెల్తీ డైట్ ఫాలో అవండి

Advertisement

Next Story

Most Viewed