- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్, రూమ్స్ లో బతకడం.. లాభమా? నష్టమా?
దిశ, ఫీచర్స్ : చదువు, ఉద్యోగం పేరుతో తల్లిదండ్రులను వదిలేసి పట్టణాలకు వెళ్లడం ఈరోజుల్లో కామన్. హాస్టల్స్, రూమ్స్ లో ఉంటూ ఎడ్యుకేషన్, జాబ్ చేసుకోవడం యూత్ కు అలవాటు అయిపోయింది. కానీ ఇలా పేరెంట్స్ ను వదిలి బయటకు రావడం.. మరో చోట బతకడం వల్ల లాభనష్టాల గురించి ఓ రెడిట్ యూజర్ ప్రశ్నించగా ఇది కాస్త వైరల్ అయిపోయింది. ఈ పోస్ట్ ఇప్పటికే భారీగా షేర్ చేయబడగా.. కామెంట్స్ కూడా అంతే మొత్తంలో రావడంతో వైరల్ అయిపోయింది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఏం చెప్తున్నారో చూద్దాం.
"ఎక్స్‌పోజర్‌ని పెంచుకోవచ్చు. వాస్తవ ప్రపంచ సవాళ్లను నిర్వహించగల సామర్థ్యాన్ని పొందొచ్చు. కొత్త ప్రదేశాలలో మన జీవితాలను మెరుగుపరచడానికి నిర్ణయాధికార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోగలం. మనీ మేనేజ్మెంట్, పర్సన్స్అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, తప్పు ఒప్పులను గుర్తించడం నేర్చుకోగలం" అని ఓ యూజర్ చెప్పాడు.
"స్వేచ్ఛ, స్వాతంత్ర్యంతోపాటు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకుంటారు. ఇంట్లో ఉంటే చాలా పాంపర్ చేయబడతారు. అదే బయట ఉంటే బట్టలు ఉతకడం, ఇంటి పనులు, కుకింగ్ వంటివి నేర్చుకోగలరు. బాధ్యతగా ఉండగలరు" అని మరొకరు చెప్పారు .
" కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి.. బాధ్యతలు తీసుకోవడం ఇష్టం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఎదుగుదల సాధ్యం కాని కంఫర్ట్ జోన్‌లోకి ఎలాగోలా చేరుకుంటారు. కాబట్టి దాని నుంచి బయటపడాలి. నిజానికి పేరెంట్స్ తో ఉన్నవారి కంటే వారికి దూరంగా ఉన్నవారు ఎక్కువ మానసిక ఆరోగ్యంగా ఉంటారు" అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు. మరొకరు.. ఈరోజుల్లో తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల 100కు 200 శాతం నష్టమే జరుగుతుందని.. స్వేచ్ఛ పెరిగి జల్సాలు మొదలవుతాయని చెప్పుకొచ్చారు.
ఇంకొందరు.. బయటికి వెళ్లడానికి, తల్లిదండ్రులను ఒంటరిగా వదిలివేయడానికి అస్సలు ఆసక్తి లేదని చెప్తున్నారు. కుటుంబ జీవితాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తామని అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా వారితో వెళ్తామని స్పష్టం చేస్తున్నారు.