- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల్లో ప్రిమెచ్యూర్ మెనోపాజ్‌తో గుండె జబ్బుల ప్రమాదం!
దిశ, ఫీచర్స్ : 40 ఏళ్లలోపే మెనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో హార్ట్ డిసీజెస్, ఫిబ్రిలేషన్(క్రమరహిత గుండె దడ) ప్రమాదం ఎక్కువని 'యూరోపియన్ హార్ట్ జర్నల్'లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో దాదాపు 1.4 మిలియన్ మహిళలు పాల్గొనగా.. ఇతరులతో పోలిస్తే అకాల రుతువిరతి ఎదుర్కొనే స్త్రీలలో ఈ సమస్య తలెత్తవచ్చని అధ్యయన రచయిత తెలిపారు.
కార్డియోవాస్కులర్ వ్యాధి సాధారణంగా పురుషుల కంటే మహిళల్లో 10 ఏళ్ల తర్వాత సంభవిస్తుంది. రుతుక్రమం ఆగిపోవడం, ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గడం వల్ల స్త్రీలు హృదయ సంబంధ వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అకాల మెనోపాజ్ 40 ఏళ్లలోపు మహిళల్లో 1 శాతం మందిని ప్రభావితం చేస్తుంది. ప్రీమెచ్యూర్(40 కంటే తక్కువ వయసు), ఎర్లీ మెనోపాజ్(45 ఏళ్లకు ముందు)తో కార్డియోవాస్కులర్ డిసీజ్‌కు మధ్య సంబంధం పరిమితంగా ఉన్నట్లు గత అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇక కొరియన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్(NHIS) నుంచి 2009లో సేకరించిన డేటాలో ప్రిమెచ్యూర్ మెనోపాజ్ విషయంలో ఏజ్‌తో పాటు హార్ట్ ఫెల్యూర్, క్రమరహిత గుండె దడ మధ్య అనుబంధాలను పరిశీలించింది. ఇందులో 30 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 1,401,175 మంది రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు ఉన్నారు. 2018 చివరి వరకు గుండె వైఫల్యం, క్రమరహిత గుండె దడ కోసం వీరు అనుసరించబడ్డారు. దాదాపు 28,111(2 శాతం) మంది వ్యక్తులు ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ చరిత్ర కలిగి ఉండగా వారి సగటు వయస్సు 36.7 సంవత్సరాలుగా ఉంది.
ఈ పరిశోధకులు ప్రిమెచ్యూర్ మోనోపాజ్‌తో పాటు 'వయసు, ధూమపానం, ఆల్కహాల్, శారీరక శ్రమ, ఆదాయం, బాడీ మాస్ ఇండెక్స్, రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, డైస్లిపిడెమియా, క్రానిక్ కిడ్నీ వ్యాధి, కరోనరీ హార్ట్ డిసీజ్, అకాల మెనోపాజ్ వయసు' వంటి విషయాలను సర్దుబాటు చేసిన తర్వాత గుండె వైఫల్యం, క్రమరహిత గుండె దడ మధ్య అనుబంధాన్ని విశ్లేషించారు. ప్రీమెచ్యూర్ మెనోపాజ్‌ను ఎదుర్కొన్న స్త్రీలకు గుండె ఆగిపోయే ప్రమాదం 33 శాతం, గుండె దడ సమస్య 9శాతం ఎక్కువని తేల్చారు.
పేగుల్లో హానికర బ్యాక్టీరియాను తొలగించే సరికొత్త వైరస్ సృష్టి!