ముగిసిన No bra day.. ఆ ఒక్క పనితో లేడీస్‌కు ఎన్ని ప్రయోజనాలో..!

by Bhoopathi Nagaiah |
ముగిసిన No bra day.. ఆ ఒక్క పనితో లేడీస్‌కు ఎన్ని ప్రయోజనాలో..!
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి రోజుల్లో ఆడపిల్లలు కౌమర దశ నుంచి వృద్ధాప్యం వరకు బ్రా( Bra)లు ధరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వయసుకు తగ్గట్టు కొత్త కొత్త డిజైన్లతో బ్రా(Latest Design Bra)లు లభ్యమవుతున్నాయి. దీంతో యువతులు వక్షోజాలు (Breasts) ఆకర్షణీయంగా, చూపరులను ఆకట్టుకునేలా బ్రాలను ధరిస్తున్నారు. కొందరు బయటకు వెళ్లేటప్పుడు వేసుకున్నా.. మరికొందరు ఇంట్లోనూ ధరించే ఉంటున్నారు. కానీ బ్రాలు నిత్యం ధరించడం వల్ల మహిళలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయాన్ని గ్రహించడం లేదు. ముఖ్యంగా బిగుతైన బ్రాలు ధరించడం వల్ల రొమ్ము కేన్సర్‌(Breast cancer)తోపాటు భుజం, మెడ, నడుము నొప్పులు వస్తుంటాయి. ఈ సమస్యలపై మహిళల్లో చైతన్యం తేవడానికే అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా నో బ్రా డే (World No Bra Day) నిర్వహిస్తుంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఆ ఒక్క రోజైనా మహిళలు బ్రాలు ధరించకుండా ఉండాలని నిబంధన పెట్టారు. అలాగే రొమ్ము కేన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలి, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలో వివరిస్తారు. అసలు మహిళలు బ్రాలు వేసుకోకపోతే ఎన్ని లాభాలు తెలుసుకుందాం.

బ్రాతో వచ్చే సమస్యలు ఎన్నెన్నో..

బిగుతైన బ్రాలు, ప్యాడెడ్(Padded bra), లేస్ డిజైన్లు (Lace designs bra)ఉన్న బ్రాలు ధరించడం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల చాతీలో నొప్పి వస్తుంది. చనుమొనల(Nipples)పై ఉండే సున్నితమైన చర్మం రాపిడికి గురై పొడిబారుతుంది. బ్రా వేసుకున్న ప్రాంతమంతా గాలి సరిగ్గా ఆడక విపరీతంగా చెమటపడుతుంది. దీనివల్ల రొమ్ములు, ఎద భాగంలో దురద, ర్యాషెస్ వచ్చి ఫంగస్ ఇన్ఫెక్షన్లు(Fungus infections) వస్తాయి. నిత్యం బిగుతైన బ్రా వేసుకోవడం వల్ల రొమ్మ కేన్సర్(Breast cancer) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అండర్ వైరింగ్ బ్రా(Underwiring bra)లతో ఈ ముప్పు అధికంగా ఉంటుందంటున్నారు. దీని వల్ల వక్షోజాల్లో నొప్పి, దీర్ఘకాలిక సమస్యలు రావచ్చని వివరిస్తున్నారు. అలాగే రొమ్ముల్లో గడ్డలు లేదా నీరు పేరుకుపోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. బ్రా నిద్రలేమి(Insomnia) సమస్యలకు దారితీస్తుందని జర్నల్ ఆఫ్ క్రోనో బయాలజీ ఇంటర్నేషనల్ (Journal of Chronobiology International) తమ పరిశోధనలో పేర్కొంది. బిగుతైన బ్రాలు. ప్యాంటీ(Panty)లు వల్ల నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. శ్వాసతీసుకోవడంలోనూ ఇబ్బందులు సృష్టిస్తాయని వివరించింది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మహిళలు బిగుతైన బ్రాలు ధరించకపోవడం మేలు. నాసిరకమైని కాకుండా బ్రాండెడ్, శరీరానికి సరిపడే బ్రాలను ఎంచుకోవడం బెటర్. ఎదుటి వారిని ఆకర్షించడానికి కంటే వక్షోజాలు సౌకర్యవంతంగా ఇమిడిపోయేలా ఉండే వాటిని వాడాలి. ఇంట్లో ఉన్నప్పుడు అసలు బ్రాలు ధరించకపోవడం చాలా ఉత్తమం. ఇంట్లోనే కాకుండా టూర్లకు వెళ్లిన సమయాల్లో, హోటళ్లలో స్టే చేసిన సందర్భాల్లోనూ నిద్రకు ముందు బ్రాలను విప్పేయాలి. అలా కుదరని పక్షంలో కనీసం హుక్స్ అయిన తొలగించి నిద్రించాలి. రొమ్ముల్లో నొప్పులు, బిగుతుగా మారడం, అధికంగా కిందికి జారిపోయినట్టు ఉండటం, నీరుచేరినట్లు ఉన్నట్లయితే వెంటనే వక్షోజాలను స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లి రాగానే వెంటనే బ్రా ను విప్పేయడంతో పాటు స్నానం చేయాలి. దీని వల్ల చెమట ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లు(Infections) రాకుండా ఉంటాయి.

Advertisement

Next Story