ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం అంత కష్టమా.. మెనూ యాంగ్జైటీ వేధిస్తోందట !

by Hamsa |
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం అంత కష్టమా.. మెనూ యాంగ్జైటీ వేధిస్తోందట !
X

దిశ, ఫీచర్స్: రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడో, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడో మీరు ఎలా చూస్ చేసుకుంటారు? ముందుగా మెనూ లిస్టును కిందికి స్ర్కోల్ చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఎండ్‌లెస్ ఆప్షన్‌ల మధ్య ఏది ఎంచుకోవాలో అనే ఆలోచనతో కొందరు ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల వరల్డ్ వైడ్ ప్రతీ పది మందిలో ముగ్గురు రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసే క్రమంలో మెనూ యాంగ్జైటీకి గురవుతున్నట్లు 2,000 మంది అడల్ట్స్‌పై వన్‌పోల్ అండ్ అవోకాడో గ్రీన్ మ్యాట్రెస్ నిర్వహించిన ఒక కొత్త సర్వే పేర్కొన్నది. చాలామంది లార్జ్ మెనూని పరిష్కరించడం చాలా కష్టమైన విషయంగా భావిస్తున్నట్లు వెల్లడించింది.

18 నుంచి 43 సంవత్సరాల మధ్య వయస్సులో 41 శాతం మంది, 44 నుంచి 77 ఏళ్ల మధ్య వయస్సు గలవారిలో 15 శాతం మంది మెనూ యాంగ్జైటీతో ఇష్టమైన ఆహారాన్ని సక్రమంగా ఆర్డర్ చేసుకోలేకపోతున్నారని సర్వే స్పష్టం చేసింది. ఇక మిడిల్ ఏజ్ దాటినవారు మెనూ లిస్ట్ చెక్ చేయడానికి అలసటగా భావిస్తున్నారు. దీంతో సొంతంగా ఆర్డర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదట. అందుకోసం వారు తరచుగా తమ కుటుంబంలోని లేదా చుట్టుపక్కల ఉన్న యువతను ఆర్డర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంటారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు వెల్లడించారు. అయితే ఆర్డర్ చేయడం అంత ఈజీ కాదని కొందరు ఎందుకు భావిస్తున్నారంటే.. లాంగ్ మెనూ లిస్టును స్ర్కోల్ చేయడంతోపాటు అందులో టేస్టీ ఫుడ్ వెతుక్కోవడం తమకు ఆందోళన కలిగిస్తోందని 71 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. మరో 57 శాతం మంది రుచికరమైన ఆహారం రేటు ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. 22 శాతం మంది కొన్నిసార్లు భోజనం సరిగ్గా ఉండట్లేదని భావిస్తున్నారు. 16 శాతం మంది ఫుడ్ విషయంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ గురించి ఆందోళన చెందుతున్నట్లు సర్వే పేర్కొన్నది.

Also Read: లోన్లీనెస్‌‌ను దూరం చేస్తున్న ఏఐ పవర్డ్ రోబోట్స్.. ఫ్రెండ్స్‌లా హెల్ప్ చేస్తాయంటున్న నిపుణులు

Next Story

Most Viewed