Musk Melon : గింజలే కానీ.. తింటే ఎన్ని లాభాలో..

by Javid Pasha |
Musk Melon : గింజలే కానీ.. తింటే ఎన్ని లాభాలో..
X

దిశ, ఫీచర్స్ : ఏవైనా పండ్లు కొన్నప్పుడు మనం ఏం చేస్తాం..? తొక్కలు, గింజలు పడేసి గుజ్జును తినేస్తాం.. కానీ కొన్ని రకాల పండ్లలో వాటి గుజ్జుతోపాటు గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి వాటిలో కర్బూజ ఒకటి. దీని గింజలు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

* వేసవిలో కర్బూజ పండును (Musk Milan ) తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కారణం.. దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్. ముఖ్యంగా ఇది వేసవి తాపాన్ని, శరీరంలోని వేడిని కంట్రోల్ చేసి, చల్లని అనుభూతిని కలిగిస్తుంది. అందుకే జ్యూస్ రూపంలో, సలాడ్ రూపంలో తీసుకుంటారు. అయితే ఈ పండుకంటే కూడా దీనిలోని గింజలు అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తాయంటున్నారు నిపుణులు. వంద గ్రాముల కర్బూజ గింజల్లో 7 శాతం వరకు ఆరోగ్య కరమైన కార్బోహైడ్రేట్లు, ఒక శాతం కంటే తక్కువగా కొవ్వు, 2 శాతం ప్రొటీన్లు ఉంటాయి. దీంతోపాుట విటమిన్ ఎ, ఇ, సి, కెలతోపాుట పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని డైట్‌లో చేర్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

*బీపీ కంట్రోల్ : కర్బూజ సీడ్స్‌లో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడంవల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పరోక్షంగా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా కర్బూజాలోని పోషకాలు జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపండలో సహాయపడతాయి. ప్రొబయోటిక్ లక్షణాలు కూడా ఉండటంవల్ల గట్ హెల్త్‌కి మంచిది.

*ముడతలు తగ్గుతాయ్ : కర్బూజ గింజల్లో విటమిన్ ఎ, ఇ, సి, కె ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖంపై ముడతలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలను అడ్డుకోవడం ద్వారా యవ్వన ఛాయలను పెంపొందిస్తాయి. స్కిన్ గ్లోను పెంచుతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంతోపాటు కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి.

*కంటి ఆరోగ్యం : విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంవల్ల కర్బూజ గింజలు అంధత్వ సమస్యలను దూరం చేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. అట్లనే ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తాయి.

*గుండెకు మేలు : ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంవల్ల కర్బూజ గింజలు గుండె జబ్బుల నివారణలో కీ రోల్ పోషిస్తాయి. మలబద్ధకాన్ని దూరం చేయడంలో, ఎసిడిటీని, యాసిడ్ రిఫ్లెక్స్‌ను తగ్గిస్తాయి. వీటిలోని ఫోలేట్ రక్తహీనతను తగ్గిస్తుంది. వేసవిలో తినడంవల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కఫం సమస్యతో బాధపడేవారికి ఈ గింజలు మంచి ఆహారం. కర్బూజ గింజల్లోని పొటాషియం ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed