విషంగా మారుతున్న పుదీనా ఫ్లేవర్‌.. లంగ్స్ డ్యామేజ్

by Anjali |   ( Updated:2023-04-12 07:57:14.0  )
విషంగా మారుతున్న పుదీనా ఫ్లేవర్‌.. లంగ్స్ డ్యామేజ్
X

దిశ, ఫీచర్స్: పొగాకు ఉత్పత్తులతో కూడిన సిగరెట్ స్మోక్ చేస్తే ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ పడుతుందని, క్యాన్సర్‌కు దారితీస్తుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ-సిగరెట్స్(వేప్ స్మోకింగ్) చూజ్ చేసుకుంటున్నారు. స్మోకింగ్ హ్యాబిట్ నుంచి బయటపడేందుకు ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నారు. కానీ ఈ పద్ధతి కూడా డేంజరస్ అని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం. ఆహారంగా స్వీకరించే పుదీనా ఆరోగ్యానికి గొప్ప మేలు చేస్తుంది కానీ అదే ఫ్లేవర్‌ను పీల్చుకుంటే మాత్రం పాయిజనస్‌గా మారుతుందని తెలిపింది. మెంథాల్‌ను వేపింగ్ లిక్విడ్‌లో కలపడం మూలంగా లంగ్స్‌ దెబ్బతింటున్నాయని వివరించింది.

ఈ ప్రయోగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘వేపింగ్ రోబో’ను ఉపయోగించారు పరిశోధకులు. పుదీనా సువాసన వ్యత్యాసాన్ని విశ్లేషించడానికి మానవ శ్వాస, వేపింగ్ బిహేవియరల్ మెకానిక్‌లను అనుకరిస్తున్న రోబో.. ఉష్ణోగ్రత, తేమ, పఫ్ వాల్యూమ్, వేపింగ్ వ్యవధిని పరిగణలోకి తీసుకుంటుంది. ఆరోగ్యకరమైన మరియు వ్యాధిగ్రస్తుల యొక్క నమూనాను అంచనా వేస్తుంది. వేప్‌లకు సంబంధించిన లంగ్స్ పాయిజన్‌ను విశ్వసనీయంగా అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే మెంథాల్ వేపర్స్ నిస్సారమైన శ్వాసలను తీసుకున్నాయని.. మెంథాల్ స్మోక్ చేయని వారితో పోలిస్తే ఊపిరితిత్తుల పనితీరు బలహీనంగా ఉందని కనుగొన్నారు. వయస్సు, లింగం, జాతి, నికోటిన్ లేదా గంజాయి ఉత్పత్తులు తీసుకోవడంతో సంబంధం లేకుండా ఈ పరిస్థితి ఉందన్నారు. ‘చాలా మంది వేపింగ్ సురక్షితమని తప్పుగా ఊహిస్తారు. కానీ నికోటిన్ లేని వేపింగ్ మిశ్రమాలలో కూడా ఊపిరితిత్తులను దెబ్బతీసే అనేక సమ్మేళనాలు ఉంటాయి’ అని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలోని అసోసియేట్ ప్రొఫెసర్ కాంబెజ్ హెచ్ బెనామ్ తెలిపారు.

Also Read..

వేసవిలో మజ్జిగ తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Advertisement

Next Story