Micro flirting: ఎదుటి వ్యక్తిలో మీపై ఇంట్రెస్ట్ ఉందా?.. ఇలా కూడా గుర్తించవచ్చు!

by Javid Pasha |
Micro flirting: ఎదుటి వ్యక్తిలో మీపై ఇంట్రెస్ట్ ఉందా?.. ఇలా కూడా గుర్తించవచ్చు!
X

దిశ, ఫీచర్స్ : మైక్రో చీటింగ్, లవ్ ఘోస్టింగ్, లవ్ బాంబింగ్ వంటి రిలేషన్‌షిప్ ట్రెండ్స్ గురించి మీరు వినే ఉంటారు. కానీ మైక్రో ఫ్లర్టింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ డేటింగ్ ట్రెండ్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది యువతీ యువకులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మీరు అవతలి వ్యక్తిపట్ల గానీ లేదా అవతలి వ్యక్తి మీపట్ల గానీ ఆసక్తి, ఆకర్షణను కలిగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ప్రదర్శించే సూక్ష్మ కళనే మైక్రో ఫ్లర్టింగ్ అంటున్నారు నిపుణులు. ఇక్కడ పరస్పర ఆకర్షణను అంచనా వేయడానికి సున్నితమైన సరసాలు కూడా కీ రోల్ పోషిస్తాయని చెప్తున్నారు.

ఆసక్తిని పరీక్షించడం

మీరు రోజూ ఎంతోమందిని కలుస్తుంటారు. చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉంటారు. ఎంతమంది ఉన్నప్పటికీ అందులో ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రత్యేకంగా చూడటం, ప్రత్యేకంగా గౌరవించడం, మీపట్ల ఆసక్తి ప్రదర్శించడం చేస్తుంటారు. లేదా మీరే అవతలి వ్యక్తిపట్ల ఈ విధమైన ఆసక్తి కలిగి ఉండవచ్చు. దీనికి కారణం ఆకర్షణ. అయితే అది నిజంగా ఉందో లేదో పరీక్షిండమే మైక్రో ఫ్లర్టింగ్ ప్రాసెస్. ఒక విధంగా చెప్పాలంటే నచ్చిన వ్యక్తితో సున్నితంగా సరసాలాడటం. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడటం, టచ్ చేయడం వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. అవతలి వ్యక్తి ఇలా చేస్తున్నప్పుడు మీ ఇంట్రెస్ట్‌ను పరీక్షిస్తున్నట్లు లెక్క. మీరే ఆ పనిచేస్తే అవతలి వ్యక్తిని ఆకర్షించాలనుకుంటున్నారని అర్థం.

ఎందుకు చేస్తారు?

ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రారంభమయ్యే ఆకర్షణను బంధంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా చాలామంది మైక్రో ఫ్లర్టింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు. అలాగే అట్రాక్షన్, ఆసక్తి, ఇష్టం పరస్పరంగా ఉన్నాయా? ఓన్లీ వన్‌సైడ్ మాత్రమేనా అనేది తెలుసుకోవడానికి, ఇష్టపడే వ్యక్తి ద్వారా తిరస్కరణకు గురి అయ్యే అవకాశం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇది సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అంటే ఆకర్షణను సాన్నిహిత్యానికి తీసుకెళ్లే ముందు ఒకరినొకరు బాగా తెలుసుకోవాలని ‘మైక్రో ఫ్లర్టింగ్’ చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

సంకేతాలివే..

ఫ్రీక్వెంట్ ఐ కాంటాక్ట్: కొన్నిసార్లు మీకు నచ్చిన వ్యక్తిపట్ల ఆసక్తి ప్రదర్శించకుండా లేదా వారిని ఆకర్షించే ప్రయత్నం చేయకుండా ఉండలేరు. మీ చూపులు నిరంతరం వారివైపునకు లాగబడుతుంటాయి. అవతలి వ్యక్తి కూడా మిమ్మల్ని నిరంతరం చూస్తున్నట్లు మీకు అనిపిస్తే లేదా వారి చూపులు మీ వైపు మళ్లడం ప్రారంభిస్తే వారు మీతో కన్వర్జేషన్ కోసం ట్రై చేస్తున్నట్లు అర్థం.

ఇన్నోసెంట్ టచింగ్స్ : ఒక వ్యక్తి మీపట్ల ఆకర్షితులైనప్పుడు వారు మిమ్మల్ని సున్నితంగా టచ్ చేయడానికి ట్రై చేస్తారు. మాటల సందర్భంగా మీ చేతులను టచ్ చేయడం, ఏదైనా చెప్పేటప్పుడు మీ బ్యాక్ టచ్ చేస్తూ గైడ్ చేయడం లేదా ఫ్రెండ్లీగా టచ్ చేయడం వంటివి ఉల్లాసరభరితమైన స్పర్శలకు ప్రయారిటీ ఇస్తుంటారు. అంటే ఇక్కడ మీకు తెలియకుండానే మీ బాడీ లాంగ్వేజ్‌ని అంచనా వేయడానికి ఇవి రహస్య మార్గాలు.

ఎక్కువగా ఆసక్తి చూపడం : ఒక వ్యక్తి మీ గురించి తరచుగా ప్రశ్నలు అడుగుతుంటే లేదా మిమ్మల్ని బాగా తెలుసుకోవాలనే ఆసక్తి ప్రదర్శిస్తుంటే వారు మీ పట్ల ఆకర్షితులై ఉన్నారు. మైక్రో ఫ్లర్టింగ్ చేస్తున్నారు. అంటే మీతో సంబంధాన్ని మెరుగు పర్చుకోవడానికి మిమ్మల్ని పరీక్షిస్తున్నారని అర్థం.

అధిక శ్రద్ధ : మీరు ఎవరినైనా ఇష్టపడినప్పుడు వారి గురించిన చిన్న చిన్న విషయాలను కూడా ఆసక్తిగా గమనిస్తుంటారు. అవతలి వ్యక్తి కూడా మీపట్ల ఆకర్షితులై ఉన్నప్పుడు మీకు తెలియకుండానే ఇది చేస్తుంటారు. ఒక వ్యక్తి తాము మీలో గమనించిన చిన్న చిన్న విషయాలను కూడా మీకు తెలియజేయడం, మీరు గతంలో చెప్పిన విషయాలను వారు గుర్తుంచుకొని పదే పదే ప్రస్తావించడం చేస్తుంటే మైక్రో ఫ్లర్టింగ్ లక్షణమే.

డీప్ కన్వర్జేషన్స్ : ఒకరిపట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వారితో చాలాసేపు లేదా లోతుగా మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు. చిన్న విషయానికి ఎక్కువసేపు కేటాయించే ప్రయత్నం చేస్తారు. అవతలి వ్యక్తి చెప్పేది ఆసక్తిగా వింటారు. ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సూక్ష్మ సంకేతాల గురించి మీకు తెలిసి ఉన్నప్పుడు అవతలి వ్యక్తి మీపట్ల ఆసక్తి కలిగి ఉన్నారో లేదో ఈజీగా గుర్తిస్తారు.

Advertisement

Next Story

Most Viewed