Health : ఆ 3 నెలలు గర్భిణుల్లో మానసిక గందరగోళం.. కారణం ఇదే!

by Javid Pasha |
Health : ఆ 3 నెలలు గర్భిణుల్లో మానసిక గందరగోళం.. కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : సరైన డెసిషన్ తీసుకోకపోవడం, అప్పుడప్పుడూ మతిమరుపు, దేనిమీదా సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడం.. ఈ లక్షణాలు ఏ వయసు మీద పడినవారికో కాదు, గర్భిణుల్లోనూ తాత్కాలికంగా వచ్చిపోతుంటాయి. ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయ్యాక ఫస్ట్ త్రీ మంత్స్ వికారం, అలసట, వంటి లక్షణాలతో పాటు ఇవి కూడా కొందరిలో కనిపిస్తుంటాయి. అయితే దీనికి సరైన కారణం ఇప్పటి వరకు తెలియదు. కానీ ఇటీవల ఈ అంశంపై స్టడీ చేసిన శాస్త్రవేత్తలు మెదడులో వచ్చే మార్పులే అందుకు కారణమని గుర్తించారు.

అధ్యయనంలో భాగంగా 700 మంది గర్బిణులను, 600 మంది సాధారణ మహిళలను ప్రశ్నించిన పరిశోధకులు గర్భధారణ సమయంలో, సాధారణ సమయంలో కంటే 4 శాతం జ్ఞాపక శక్తి తగ్గుతోందని కనుగొన్నారు. అయితే ఈ మతిమరుపు, గందరగోళ వంటి పరిస్థితిని ‘బేబీ బ్రెయిన్’ లేదా ప్రెగ్నెన్సీ బ్రెయిన్’గా పేర్కొన్న శాస్త్రవేత్తలు ఈ సింప్టమ్స్ అందరిలో ఒకేలా ఉండవని తెలిపారు. మొదటి మూడు నెలల్లో కొంచెం ఎక్కువగా ఉండి తర్వాత నెమ్మదిస్తాయని పేర్కొంటున్నారు. అయితే దీంతోపాటు బాలింతల్లో వచ్చే మూడ్ స్వింగ్స్ లేదా తీవ్రమైన మానసిక గందరగోళం (Postpartum blues) వంటివి తగ్గించడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు.

Next Story

Most Viewed