వర్షంలో తడుస్తూ.. చలికి వణుకుతూ.. 21 గంటలు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్..

by Anjali |
వర్షంలో తడుస్తూ.. చలికి వణుకుతూ.. 21 గంటలు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్..
X

దిశ, ఫీచర్స్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువకుడు మాజీ ప్రియురాలి ప్రేమ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దజౌ సిటీలోని ఆమె ఆఫీసు ముందు 21 గంటల పాటు మోకాళ్లపై మోకరిల్లినట్లు తెలుస్తోంది. వర్షంలో తడుస్తూ.. చలికి వణుకుతూ.. ప్రేమ కోసం పరితపించిన ఆ వ్యక్తి చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అయినా సరే ఆ అమ్మాయి కనికరించకపోగా.. పోలీసులు, స్థానికుల జోక్యంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అప్పటికే బ్రేకప్ కావడంతో కుమిలిపోయిన వ్యక్తి.. మార్చి 28 మధ్యాహ్నం ఒంటి గంటకు ఎర్ర గులాబీలు పట్టుకుని తన ప్రేమను, తనను మళ్లీ అంగీకరించాలని కోరుతూ మోకాళ్లపై కూర్చున్నాడు. ముందుగా అతన్ని ఎవరు పట్టించుకోలేదు కానీ గంటలు గడిచేకొద్ది సీన్ అర్థమైపోయింది. అయితే 20 గంటలు అయినా తనకు దర్శనమివ్వని అమ్మాయిని వదిలేయాలని, తన కన్నా బెటర్ పర్సన్ దొరుకుతారని సముదాయించిన స్థానికులు.. పోలీసులను పిలిచారు.

కానీ మోకరిల్లడం చట్టవిరుద్ధం కాకపోతే తనను వదిలేయాలని కోరిన ఆ ప్రేమికుడు.. అసలు వాళ్లిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పలేదు. చివరికి అందరి జోక్యంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన అతని వీడియో చూస్తున్న నెటిజన్స్.. కొందరు ఆ వ్యక్తి లవ్ అండ్ రియలైజేషన్‌ను ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం ఎందుకు విడిచిపెట్టిందో స్పష్టంగా అర్థమవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా స్టాకింగ్ అనేది చైనాలో నేరం కాగా క్రిమినల్ చార్జెస్, పెనాల్టీస్ వేసే చాన్స్ ఉంది.

Advertisement

Next Story