- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ వృద్ధురాలికి నొప్పి అనే ఫీలింగే తెలియదు.. కారణం గుర్తించిన శాస్త్రవేత్తలు..
దిశ, ఫీచర్స్ : నొప్పి లేని జీవితం అద్భుతంగా ఉంటుంది కదా. 75ఏళ్ల వృద్ధురాలు జో కామెరాన్ ఇలాంటి పరిస్థితినే ఎంజాయ్ చేస్తుంది. తీవ్రమైన తుంటి నొప్పికి సంబంధించిన శస్త్రచికిత్స సమయంలోనూ ఆమె ఎలాంటి పెయిన్ అనుభవించకపోవడం వైద్యులు, శాస్త్రవేత్తలను అబ్బురపరచగా.. దీనిపై పరిశోధన చేసిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ FAAH-OUT జన్యువులోని ఉత్పరివర్తనలు పరమాణు స్థాయిలో పని చేయడం వల్లే ఆమె నొప్పిని అనుభవించలేకపోతుందని గుర్తించారు. కాగా ఇదే మెకానిజమ్‌ను శాస్త్రవేత్తలు గాయాలను వేగంగా నయం చేసేందుకు ఉపయోగించడం విశేషం.
2019లో నొప్పి, ఒత్తిడి, భయాన్ని అనుభవించని మహిళగా కామెరాన్ హెడ్ లైన్స్ టచ్ చేయగా.. 65ఏళ్ల వయసులో ఆమె తొలిసారి ఈ పరిస్థితిని అనుభవించినట్లు చెప్పింది. FAAH-OUT మ్యుటేషన్.. సాధారణంగా నొప్పి, మానసిక స్థితి, జ్ఞాపకశక్తికి సంబంధించిన FAAH జన్యువు యొక్క వ్యక్తీకరణను తిరస్కరిస్తుందని తర్వాత తేలింది. FAAH జన్యువులోని ఎంజైమ్ కార్యకలాపాల స్థాయిలు గణనీయంగా తగ్గాయని గుర్తించబడింది. దీంతో ఇతర పరమాణు మార్గాలపై FAAH జన్యు ఉత్పరివర్తనాల ప్రభావాలను అధ్యయనం చేయడానికి పరిశోధకులు కణజాల నమూనాలను కూడా అధ్యయనం చేశారు. WNT16 అని పిలువబడే మరొక జన్యువులోనూ యాక్టివిటీ పెరిగినట్లు కనుగొన్నారు. కామెరాన్ తక్కువ భయం, ఆందోళన, నొప్పిలేమికి కారణమైన BDNF, ACKR3 అనే ఇతర జన్యువులలో కూడా మార్పులు గుర్తించబడ్డాయి.
Also Read..
కుక్కకు సర్ ఫ్రైస్.. బర్త్ డే గిఫ్ట్‌గా బంగారం అక్షరాలతో చెక్కిన లక్షల విలువైన ఇల్లు