కింగ్ కోబ్రా తలపై నిజంగానే నాగమణి ఉంటుందా?..అసలు విషయం తెలిస్తే షాక్

by Dishafeatures1 |
కింగ్ కోబ్రా తలపై నిజంగానే నాగమణి ఉంటుందా?..అసలు విషయం తెలిస్తే షాక్
X

దిశ,ఫీచర్స్: సాధారణంగా పాము కనిపిస్తే పారిపోతారు లేదా కర్రతో కొట్టి చంపేస్తారు. అయితే ఇక్కడ మనం విష సర్పాల్లో అతి పెద్దది, అతి పొడవైన ‘కింగ్ కోబ్రా’ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా విషపూరిత పాము అని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఇది కాటేస్తే దాని విషంలోని న్యూరో టాక్సిన్లు మనిషి మొదడులోని శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపి కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై ప్రాణం పోయే అవకాశం ఉంది. అయితే కింగ్ కోబ్రా తలపై మణి ఉంటుందనీ, ఆ మణి మన దగ్గర ఉంటే.. మరణం సంభవించదని, సిరి సంపదలు కలిసి వస్తాయని నమ్మకం. ఆ కారణంతోనే అరుదైన కింగ్ కోబ్రా ని వెతికి చంపేస్తున్నారు. అలాగే నాగమణికి మంత్ర శక్తులు కూడా ఉంటాయని ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు, సీరియల్స్‌ కూడా తీసారు.

నిపుణుల ప్రకారం:

స్వాతీ నక్షత్రం రోజున వర్షం పడినప్పుడు ఒక వర్షపు చుక్క పాము నోట్లోకి వెళ్లడం వల్ల మణి తయారవుతుందని, మణి ఉన్న పాముకు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వస్తాయన్నది కొందరు వాదిస్తుంటారు. అయితే ఇవన్నీ కేవలం కట్టు కథలు మాత్రమే. పాము తలపై రాయిని ముందుగా వారే పెడతారు. దాన్ని మణిగా చెబుతూ మన ముందు తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. ఇవన్నీ నమ్మితే మీరు మోసపోయినట్లే అని నిపుణులు చెబుతున్నారు. నాగమణి ఉన్నట్లు, అది ఎవరికో ఒకరికి దొరికినట్లు.. చరిత్రలో చిన్న ఆధారం కూడా లేదు. కానీ నాగమణి ఉందని ప్రచారం చేస్తూ కొందరు లక్షల్లో దోచుకుంటున్నారు అని చెబుతున్నారు.



Next Story

Most Viewed