- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీనేజ్‌లో ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్.. పెద్దయ్యాక 68% మందిలో కంటిన్యూ అవుతున్నాయట
దిశ, ఫీచర్స్: టీనేజ్‌లో సంభవించే శారీరక మార్పులు, వేగవంతమైన ఎదుగుదల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. సొంత ఆలోచనలను నావిగేట్ చేసే క్రమంలో అభద్రత, అనిశ్చితి భావాలు యువతను వెంటాడుతాయి. అయితే ఈ ఎఫెక్ట్ అధికంగా ఉండటం, మొదట్లోనే నియంత్రణ లేకపోవడం కారణంగా కొందరిలో లైఫ్‌లాంగ్ కంటిన్యూ కావచ్చునని యూఎస్ కేంద్రంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల 2000 మందిపై స్మైల్ ఎక్స్‌ప్రెస్ తరపున వన్‌పోల్ నిర్వహించిన రీసెంట్ సర్వేలో వెల్లడైంది. మూడింట రెండు వంతులకంటే ఎక్కువమంది (68 %) పెద్దలు యుక్తవయస్సులో ఎదుర్కొన్న ఎమోషన్స్‌ను ఆ తర్వాతి కాలంలో కూడా ఎదుర్కొంటారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొంటున్నారు.
యుక్త వయస్సులో 65 శాతం మంది ప్రజలు తమ బాడీ షేప్ గురించి, 61 శాతం మంది తమ హెయిర్ స్టైల్ అండ్ స్మైల్ గురించి స్వీయ-స్పృహ కలిగి ఉంటారు. యావరేజ్ పర్సన్స్ తమ 17 సంవత్సరాల వయస్సులో ఈ విధమైన ఫీలింగ్స్‌ను అధికంగా ఎదుర్కొంటారు. ఇక పెద్దయ్యాక (26-45) కూడా సగం మందికి పైగా అంటే.. 55 శాతం మంది తమ శరీర ఆకృతి గురించి, 53 శాతం మంది హెయిర్ స్టైల్ గురించి, 52 శాతం మంది తమ చిరునవ్వు గురించి అసౌకర్యంగా ఫీలవుతున్నారని సర్వే పేర్కొన్నది. ఈ విషయంలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారట. మహిళల్లో 39 శాతం మంది తమ ఐ గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్స్ గురించి అసౌకర్యంగా భావిస్తుండగా, 51 శాతం మంది పురుషులు కూడా అదే ఫీలవుతున్నారు. హైట్ విషయంలో 42 శాతం మంది మహిళలు అసౌకర్యం, అనిశ్చితి భావాలను ఎదుర్కొంటుండగా, 48 శాతం మంది పురుషులు అవే ఫీలింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. హెయిర్ స్టైల్ విషయంలో ఇబ్బంది పడుతున్నవారిలో మహిళలు 48 శాతం ఉండగా, పురుషులు 57 శాతం మంది ఉంటున్నారు. చిరు నవ్వు విషయంలో 49 శాతం మంది స్త్రీలు అసౌకర్యంగా భావిస్తుండగా, 55 శాతం మంది పురుషులు అదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
Read More: పీరియడ్ పెయిన్‌తో బాధపడుతున్నారా? వెండి పట్టీలతో ఉపశమనం..