Irula Tribe: వీరికి పాములు ఆట బొమ్మలతో సమానం.. పిల్లలు కూడా విషాన్ని తీయగలరు..!

by Vennela |   ( Updated:2025-03-20 15:23:04.0  )
Irula Tribe: వీరికి  పాములు  ఆట బొమ్మలతో సమానం.. పిల్లలు కూడా విషాన్ని తీయగలరు..!
X

దిశ, వెబ్ డెస్క్: Irula Tribe: ఇరుల తెగ ప్రజలు విషపూరిత పాములను కూడా ఆట బొమ్మల్లా పట్టుకుంటారు. ఆ పాముల నుంచి విషాన్ని తీస్తారు. ఈ తెగకు చెందిన పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా పాము విషయాన్ని ఇట్టే తీసేస్తారు. వీరు సేకరించిన విషాన్ని శాస్త్రవేత్తలకు పరిశోధనకు, ఇతర మందులు తయారు చేసే సంస్థలకు సరఫరా చేస్తున్నారు. ఈ తెగ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పాము అనే పేరు చెబితే చాలు గజగజ వణికిపోయే వారు ఎంతో మంది ఉంటారు. చిన్న పాము చూసి ఆమడ దూరం పరుగెత్తేవారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే విషపూరితమైన పాము కాటేస్తే మరణించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మందికి పాములంటే భయం. అయితే మన దేశంలోని ఒక తెగ ప్రజలు మాత్రం పాములు అంటే అస్సలు భయపడరు. విషపూరితమైన పాములతో ఆడుకుంటారు. వీరు వాటిని ఆటబొమ్మలుగా భావిస్తుంటారు. ఈ తెగకు చెందిన యువకులు, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ పాములను పట్టుకోవడం, వాటి విషాన్ని తీయడంలో నిపుణులు. ఈ తెగ పేరు ఇరుల తెగ.

ఇరు తెగ ప్రజలు దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, తమిళనాడులోని అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరు పాములను చూసి పారిపోరు. వాటిని చేతుల్లోకి తీసుకుని పట్టుకుంటారు. వాటిని విషాన్ని సేకరించి ఔషధాలు తయారు చేస్తారు. తమిళనాడులోని తిరువలూరు జిల్లాలో ఇరుల తెగ జనాభా అత్యధికంగా ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వారిని కల్బెలియా తెగ అని కూడా పిలుస్తారు. ఈ కమ్యూనిటీ ప్రజలు పుట్టల్లో దాగి ఉన్న పాములను పట్టుకోవడంలో దిట్టలు.

ఇరుల తెగ ప్రజలు తరతరాలుగా పాములను పడుతూ జీవనం సాగిస్తున్నాయి. ఇది వారి ప్రధాన వృత్తి. ఎలాంటి విషపూరిత పాముల నుంచి అయినా సరే విషాన్ని తొలగించడంలో ప్రావీణ్యం సంపాదించింది. దాదాపు 3లక్షల జనాభా ఉన్న ఈ తెగలో 90శాతానికి పైగా పాములను పడుతున్నారు. ఈ విషంతోనే శాస్త్రవేత్తలు ప్రతి ఏడాది పాము కాటుకు ప్రాణాలను రక్షించే మందులను తయారు చేయడానికి తాము సేకరించిన విషాన్ని ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. కింగ్ కోబ్రా, క్రైట్, రస్సెల్ వైపర్ , ఇండియన్ సా స్కల్ వైపర్ వంటి విషపూరితమైన పాముల నుంచి విషాన్ని తీస్తారు. ఈ విషం తీసినందుకు వారికి డబ్బు కూడా చెల్లిస్తారు.

అయితే ఈ తెగ ప్రజలు ఇరు స్నేక్ క్యాచర్స్ ఇండస్ట్రియల్ కో ఆపరేటివ్ సొసైటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే పాము విషయాన్ని సేకరించే అతిపెద్ద సొసైటీల్లో ఒకటి. ఈ సంఘం 1978లో స్థాపించారు. ఇందులో నేడు వందలాది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ఆమోదంతోనే ఇరులా తెగ ప్రజలు సేకరించిన విషాన్ని ఔషధ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. వీరు ప్రతి ఏడాది సుమారు 25కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఈ విధంగా ఈ తెగ ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలను కాపాడటంటో పరోక్షంగా దోహదపడుతుంది.

READ MORE ...

Rain smell: వర్షం వచ్చే ముందు మట్టి వాసన అంటే ఇష్టమా? మరీ అదేలా వస్తుందో తెలుసా?



Next Story