పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు.. తాజా అధ్యయనంలో నమ్మలేని నిజాలు

by Disha Web Desk 7 |
పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు.. తాజా అధ్యయనంలో నమ్మలేని నిజాలు
X

దిశ, ఫీచర్స్: భారతదేశంలో వివాహ బంధానికి చాలా పవిత్రమైన గుర్తింపు ఉంది. కానీ, ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. కట్టుకున్న భర్త/భార్యను, పుట్టిన పిల్లల్నీ పట్టించుకోకుండా చాలా మంది వివాహేతర సంబంధాలకే ఎక్కువ ఎట్రాక్ట్ అవుతున్నారు. భర్త తాగుతున్నాడనో, కొడుతున్నాడనో.. భార్య మాట వినడం లేదనో ఇలా చిన్న చిన్న కారణాల చేత.. వేరే వాళ్లపై ప్రేమను పెంచుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 5నిమిషాల పడక సుఖం కోసం చాలా మంది ప్రాణలు తీస్తున్నారు.. లేదంటే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇల్లీగల్ రిలేషన్ బాగా ఎక్కువైపోతున్న క్రమంలోనే.. తాజాగా దీనిపై సర్వే నిర్వహించింది ఓ సంస్థ.

ఈ అధ్యయనంలో భారతదేశంలోని వివాహిత వ్యక్తులు.. ఎక్కువగా వివాహేతర సంబంధాలకే ఇష్టపడుతున్నట్లు తేలింది. దీనికోసం టైర్1, టైర్2 నగరాల నుంచి 25 నుంచి 50 సంవతర్సాల మధ్య వయసుగలవారైన దాదాపు 1500 మందిపై ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 60 శాతం మంది డేటింగ్ వైపే ఎక్కువ మక్కు చూపుతున్నారట. అంతే కాకుండా 46 శాతం మంది పురుషులు అలాంటి సంబంధాలను ఇష్టపడుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. వీరిలో కోల్‌కతాకి చెందిన వారు ఎక్కువగా ఉండటం విశేషం. ఇక మహిళల విషయానికి వస్తే 35 శాతం మంది వేరే వాళ్లతో ఉండేందుకు ఇష్టపడుతున్నారట.

Next Story

Most Viewed